బిజినెస్

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 19: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నప్పటికీ భారత్ మాత్రం ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే కొనసాగుతోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు. అక్టోబర్ 21న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న తరుణంలో జావడేకర్ శనివారం నాడిక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ తన ప్రభుత్వ మంచి పనితీరు కారణంగా దూసుకు పోతుండగా, ప్రతిపక్షాలు ఏ అంశం లేకుండా నిరాశకు లోనయ్యాయని అన్నారు. మహారాష్టల్రోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 222 స్థానాలను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది అభ్యర్థులు తమ ఓటమిని అంగీకరించారు. ప్రచారాన్ని, డబ్బు వ్యయాన్ని నిలిపివేశారు’ అని జవడేకర్ అన్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్న పరిస్థితుల్లో బీజేపీ జాతీయవాదం వంటి అంశాలపైనే ఎందుకు ఎక్కువగా కేంద్రీకరించిందని ప్రశ్నించగా, ఆర్థిక మాంద్యం వాతావరణం ప్రపంచ వ్యాప్తంగా నెలకొని ఉందని ఆయన బదులిచ్చారు. ‘చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 11 శాతం నుంచి ఆరు శాతానికి పడిపోయింది. అలాంటి వాతావరణమే యూరప్, అమెరికాలలోనూ నెలకొని ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. దేశంలో బ్యాంకులు మూతపడలేదని, అందువల్ల డిపాజిటర్లు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జవడేకర్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘ఉద్యోగాలు క్రమంగా పెరుగుతున్నాయి.. అయితే, వస్తు తయారీ, ఎగుమతి రంగాలలో సమస్యలు ఉన్నాయి. కొన్ని రంగాలలో సమస్యలు తలెత్తాయి. అయితే, తక్షణమే చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం. ఇక్కడ ఏ ఒక్కరూ ఊరకే కూర్చోరు’ అని ఆయన అన్నారు. భారత్‌ను 2024 నాటికి 5ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరేట్టుగా కనిపించడం లేదని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా, భారత్ గత ఏడేళ్లుగా ఏడు శాతానికి పైగా సగటు వృద్ధి రేటును సాధించిందని జావడేకర్ అన్నారు. ఇప్పుడు బాగా చేయలేదు కాబట్టి వచ్చే సంవత్సరం కూడా బాగా చేయబోరు అనేది కాంగ్రెస్ ఆలోచనావిధానం కావొచ్చని, తాము అలా ఆలోచించమని ఆయన అన్నారు. మన్మోహన్ సింగ్ అభిప్రాయంతో తాము ఏకీభవించడం లేదని జావడేకర్ పేర్కొన్నారు.