బిజినెస్

కార్పొరేట్ పన్ను కోతతో పెట్టుబడుల పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 19: భారత ప్రభుత్వం కార్పొరేట్ ఆదాయపు పన్నును తగ్గిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) శుక్రవారం సమర్థించింది. ఈ నిర్ణయం పెట్టుబడులపై సానుకూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. అయితే, భారత్ ఆర్థిక సంఘటితానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించవలసి ఉందని, దీర్ఘకాలిక స్థిరమయిన ఆర్థిక పరిస్థితులను తీసుకు రావలసి ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. ‘్భరత్‌లో ఇప్పటికీ ఆర్థిక అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. అందువల్ల వారు జాగ్రత్తగా ఉండవలసి ఉంది. వారు కార్పొరేట్ ఆదాయపు పన్నును తగ్గించడాన్ని మేము సమర్థిస్తున్నాం. ఎందుకంటే ఆ చర్య పెట్టుబడులపై సానుకూల ప్రభావం చూపుతుంది’ అని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ చాంగ్‌యోంగ్ రీ ఇక్కడ విలేఖరుల సమావేశంలో చెప్పారు. భారత్‌లో గత రెండు త్రైమాసికాలలో ఆర్థిక మాంద్యం నెలకొనడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాను 6.1 శాతానికి కుదించారు.