బిజినెస్

ఎన్నాళ్లకెన్నాళ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 18: బ్రిగ్జిట్ డీల్‌కు సంబంధించిన చర్చలు సానుకూలపడడంతోబాటు, అనూహ్యంగా వచ్చిన విదేశీ పెట్టులతో శుక్రవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడిచాయి. దీంతో చాలాకాలం తర్వాత ఇలా వాణిజ్యవారం మొత్తం మార్కెట్లు లాభాలను సంతరించుకోవడం పట్ల వ్యాపారవర్గాల్లో హర్షం వ్యకతమవుతోంది. వాస్తవానికి గత వాణిజ్యవారం చివరి రోజు నుంచే మొదలైన ఈ లాభాల పరంపర వరుసగా ఆరు రోజులపాటు సాగింది. కాగా తాజాగా బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 246.32 పాయింట్లు (0.63శాతం) లాభపడి 39,298.38 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 39,361.06 పాయింట్ల గరిష్టాన్ని, 38,963.60 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌సీ సూచీ నిఫ్టీ సైతం 75.50 పాయింట్లు (0.65శాతం) లాభపడి 11,661.85 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో యెస్ బ్యాంక్ అత్యధికంగా 8.44 శాతం లాభపడింది. అలాగే మారుతి, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఎల్ అండ్ టీ, ఎస్‌బీఐ సైతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు టాటామోటార్స్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ 1.05 శాతం నష్టపోయాయి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) త్రైమాసిక ఫలితాలు మార్కెట్ వేళల అనంతరం వెలువడిన క్రమంలో ఆ సంస్థ వాటాలు సైతం 1.37 శాతం లాభపడ్డాయి. అలాగే ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ సైతం బీఎస్‌ఈలో రూ. ఇంట్రాడేలో 9,05,214 కోట్లకు పెరిగి చివరికి రూ.8,97.179 కోట్ల వద్ద స్థిరపడింది. ఇక రంగాలవారీగా చూస్తే బీఎస్‌ఈలో విద్యుత్, కేపిటల్‌గూడ్స్, స్థిరాస్తి, వినిమయ వస్తువులు, లోహ, ఇంధన సూచీలు 2.63 శాతం లాభాలను నమోదు చేశాయి. మొత్తం 19 రంగాల సూచీలు లాభాలను నమోదు చేయడం విశేషం. ఇక బ్రాడర్ మార్కెట్‌లో బీఎస్‌ఈ సెనె్సక్స్‌లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్, లార్జ్‌క్యాప్ సూచీలు లాభపడ్డాయి.
స్వల్పంగా బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం స్వల్పంగా బలపడి ఇంట్రాడేలో 71.13గా ట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.12 శాతం పెరిగి బ్యారెల్ ధర 9.98 డాలర్లకు చేరింది. ఇక ఆసియా మార్కెట్లు టోక్యో మినహా మిగిలిన షాంఘై, హాంగ్‌కాంగ్, సియోల్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. చైనా ఆర్థికాభివృద్ధి మూడు దశాబ్థాల కనిష్టానికి చేరిన క్రమంలో ఆ పరిణామం మార్కెట్లపై పడింది. ఇక ఐరోపా మా ర్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి.