బిజినెస్

వరుసగా రెండు వారాలు లాభాల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోవారం లాభాలను నమోదు చేశాయి. ఈవారం మొత్తం సెనె్స క్స్ 1,171.30 పాయింట్లు (3.07 శాతం) లాభపడగా, నిఫ్టీ 356.80 పాయింట్ల ఆధిక్యతను సాధించింది. గత వారం సైతం ఈ రెండు సూచీలూ లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక ఉద్దీపన పథకాలు, పన్ను రాయితీయల కారణంగానే దేశీయ స్టాక్ మార్కెట్లు ఇలా లాభాల బాట పట్టాయని వాణి జ్య వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా తాజాగా ముగిసిన వాణిజ్యవారంలో మొత్త ఐదురోజులూ సూచీలు లాభాలను నమోదు చేయడం విశేషం. గడచిన మార్చినెల తొలిపక్షం నుంచి ఇప్పటి వరకు ఇవే అతి సదీర్ఘ లాభాలుగా నమోదయ్యాయి. అలాగే భార త ఈక్విటీలు మెజారిటీ శాతం విదేశీ మార్కెట్లలో ఈవారం లాభాలను సంతరించుకున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ఫలప్రదంగా సాగడం, బ్రెగ్జిట్ డీల్‌పై ఐరోపా సమాఖ్య, బ్రిటన్ మధ్య దాదాపుగా కుదిరిన అంగీకారం ఇలా దేశీయ స్టాక్‌మార్కెట్లకు లా బాల బాట పట్టించాయని ప్రముఖ విశే్లషకుడు సంజీవ్ జర్బడే పే ర్కొన్నారు. గత ఐదు రోజుల వాణిజ్య వారంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 1.2 బిలియన్ డాలర్ల విలువైన వాటాలను మన దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనుగోలు చేశారు. అలాగే దేశీయ సం స్థాగత ఇనె్వస్టర్లు సైతం 263 మిలియన్ డాలర్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారని స్టాక్ ఎక్చేంజ్ గణాంగాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక ఉద్దీపనకు మరింతగా భరోసానిస్తూ చేసిన వ్యాఖ్యలూ సానుకూలంగా మారాయ.