బిజినెస్

లాభాలు తెచ్చిన ఫైనాన్స్, ఇంధన స్టాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 16: అంతర్జాతీయంగా మార్కెట్ల స్థితిగతులు మిశ్రమంగానే ఉన్నప్పటికీ దేశీయంగా ఫైనాన్స్, ఇంధన రంగాల్లో భారీగా వాటాల కొనుగోళ్లు జరగడంతో స్టాక్ మార్కెట్లు నాలుగో రోజైన బుధవారంనాడూ లాభాల బాటలో సాగాయి. ఐతే ఆ లాభాలు ఓ మోస్తరు స్థాయికే పరిమితం కావడం గమనార్హం. సూచీలు రోజంతా ఒడిదుకులకు గురైన క్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సెనె్సక్స్ ఓ దశలో 250 పాయింట్ల ఆధిక్యతకు ఎగబాకింది. చివరికి 92.90 పాయింట్ల (0.24 శాతం) ఆధిక్యతతో 38.598.99 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 38,666.36 పాయింట్ల గరిష్టాన్ని, 38,416.67 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 35.70 పాయింట్ల ఆధిక్యాన్ని (0.31 శాతం) నమోదు చేసింది. 11,464 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, యెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఆర్‌ఐఎల్ అత్యధికంగా 3.57 శాతం లాభపడ్డాయి. మరోవైపు హీరోమోటోకార్ప్, వేదాంత, ఏసియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, ఐటీసీ, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, టాటామోటార్స్, 2.73 శాతం నష్టపోయాయి. ఇక ఆసియా మార్కెట్లలో హాంగ్‌కాంగ్, సియోల్, టోక్యో స్టాక్ మార్కెట్లు లాభాల్లోనూ, షాంఘై మార్కెట్లు నష్టాల్లోనూ ముగిశాయి. అలాగే ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలనే నమోదు చేశాయి. మంగళవారం ఇంగ్లాండ్, ఐరోపా ప్రతినిధులు నిర్వహించిన చర్చలు ‘బ్రెగ్జిట్’ డీల్‌కు సమీపానికి చేరువైనప్పటికీ చివరికీ ఓ ప్రత్యేక నిర్ణయాత్మకత వైఖరిని అనుసరించడంలో వైఫల్యం చోటుచేసుకుందన్న విమర్శలు వచ్చాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయంగా మదుపర్లు అయోమయానికి గురయ్యారని, మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయని వాణిజ్య నిపుణులు విశే్లషించారు.
బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బుధవారం 17 పైసలు బలపడింది. ఇంట్రాడేలో 71.37గా ట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.17 శాతం తగ్గి బ్యారెల్ 58.64 డాలర్లుగా ట్రేడైంది.