బిజినెస్

సహకార బ్యాంకులను ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 15: అర్బన్ సహకార బ్యాంకులను రెండు రకాల పరిధుల్లో కాకుండా మొత్తంగా రిజర్వు బ్యాంకు నియంత్రణ పరిధిలోకి చేర్చాలని అఖిల భారత రిజర్వు బ్యాంకు ఉద్యోగుల సంఘం మంగళవారం నాడిక్కడ సూచించింది. పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీబీ)లో భారీ కుంభకోణం చోటుచేసుకున్న దృష్ట్యా అలాంటివి పునరావృతం కాకుండా ఆర్బీఐ చొరవ తీసుకోవాలని కోరింది. అన్ని సహకార బ్యాంకులపై ఆర్బీఐ ఆన్‌సైట్ పర్యవేక్షణ చేపట్టాలని, ప్రస్తుతం ఉన్న వార్షిక ఆఫ్‌సైట్ విధానాన్ని తొలగించాలని సైతం విజ్ఞప్తి చేసింది. భారీగా అవకతవకలు వెలుగుచూసిన క్రమంలో పీఎంసీబీ గత సెప్టెంబర్ 23 నుంచి ఆర్బీఐ నియంత్రణ ఆంక్షల పరిధిలోకి చేరిన సంగతి తెలిసిందే. గత జనవరి నెల నుంచి ఆర్బీఐ 24 సహకార బ్యాంకులను తన పరిపాలన పరిధిలోకి చేర్చడం జరిగింది. కాగా అర్బన్ సహకార బ్యాంకులకు రెండు రకాల నియంత్రణ పరిధులు ఉండడం వల్ల లొసుగులు ఏర్పడి యాజమాన్య పరమైన అవకతవకలకు తావిస్తోందని ఉద్యోగుల సంఘం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీన్ని నివారించాలంటే అన్ని బ్యాంకుల్లాగా ఓకే విధమైన ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి తేవడమే ఉత్తమమార్గమని సూచించింది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు సాధారణంగా సహకార సంఘాలుగా రాష్ట్ర సహకార సంఘాల చట్టం, లేదా బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం 2002 కింద రిజిస్టర్ అవుతాయని ఆ సంఘం గుర్తు చేసింది. ఈక్రమంలో ఆ బ్యాంకులు రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్, లేదా కేంద్ర సహకార బ్యాంకుల రిజిస్ట్రార్ నియంత్రణ, పర్యవేక్షణల పరిధిలో ఉంటాయన్నారు. అందువల్ల ఆర్బీఐ మాత్రమే సక్రమంగా ఈ బ్యాంకుల పనితీరును నియంత్రించడం, పర్యవేక్షించడం చేయగలదని తెలిపింది. అలాగే ఆర్బీఐ ఆన్‌సైట్ తనిఖీలు నిర్వహించడం చేయడం ద్వారా ఆ బ్యాంకుల యాజమాన్యాలను స్వల్ప అధికారులకు మాత్రమే పరిమితం చేయాలని రిజర్వు బ్యాంకు ఉద్యోగుల సంఘం సూచింది. డిపాజిటర్ల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని సహకార బ్యాంకులకు నిర్థిష్టమైన మార్గదర్శకాలను ఆర్బీఐ సూచించాలని కోరింది.