బిజినెస్

విప్రో తాజా త్రైమాసిక నికర లాభాల్లో 35శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: బెంగుళూరు ప్రధాన కేంద్రంగా నడిచే దిగ్గజ కంపెనీ ‘విప్రో లిమిటెడ్’ గత సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలను మంగళవారం నాడిక్కడ వెల్లడించింది. మొత్తం రూ. 2,552.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఈ త్రైమాసికంలో ఆర్జించినట్టు తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ లాభం 35 శాతం అధికమని పేర్కొంది. అలాగే ఈకాలంలో రూ. 15,875.4కోట్ల ఆదాయం ఆర్జించినట్టు తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 15,203.2 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ఇయర్ అన్ ఇయర్ ప్రాతిపదికన కంపెనీ ఆదాయంలో 4 శాతం వృద్ధి చోటుచేసుకుని మొత్తం ఆదాయం రూ. 1,51.25.6 కోట్లకు చేరింది. డిసెంబర్ త్రైమాసికం నాటికి ఐటీ సర్వీస్ ఆదాయం 0.8-2.8 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. అలాగే వాణిజ్యం మొత్తం 2,048.9 మిలియన్ డాలర్లకు చేరుతుందని, ఇయర్ బై ఇయర్ విధానంతో 2.5 శాతం ఆదాయ వృద్ధి చోటుచేసుకుంటుందని తెలిపింది. అలాగే తాజా త్రైమాసికంలో ఐటీ సేవల ఆపరేటింగ్ మార్జిన్ కూడా 18.1 శాతం పెరిగి నికర ఆదాయం రూ. 2,552.7 కోట్లు సమకూరింది. తమ కంపెనీకి తాజాత్రైమాసికంలో అటు ఆదాయం, ఇటు మార్జిన్ పరంగా మంచి పనితీరును కనబరచిందని విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అబిదాలీ జెడ్ నీముచ్‌వాలా ఆనందం వ్యక్తం చేశారు. కాగా అంతర్జాతీయంగా లభిస్తున్న ఆఫరింగ్‌ను భారత వినియోగదారుల దరిచేర్చేందుకు సంబంధించి భారత్ అనుబంధ సంస్థతో ఓ అతిపెద్ద ఒప్పందంపై తమ కంపె నీ సంతకాలు చేసిందని ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్‌దలాల్ తెలిపారు. అలాగే వాటాల బైబ్యాక్ కార్యక్రమాన్ని గత సెప్టెంబర్‌లో విజయవంతంగా తమ కంపెనీ నిర్వహించిందని గుర్తు చేశారు.