బిజినెస్

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు గురికాగా అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో ప్రగతితో వచ్చిన సానుకూలతలతో చివరికి రెండు సూచీలూ స్వల్ప లాభాలను నమోదు చేశాయి. ఒక దశలో 448 పాయింట్లు ఎగబాకిన బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ తర్వాత నేల చూపులు చూసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 38,513.69 పాయింట్ల గరిష్టాన్ని, 38,068.13 పాయింట్ల కనిష్టాన్ని స్పృశించింది. అంతర్జాతీయ సానుకూలతలతో కోలుకుని చివరికి 87.39 పాయింట్లు (0.23 శాతం) లాభపడి 38,214.47 పాయింట్ల గరిష్ట స్థాయిలో ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 36.10 పాయింట్లు (0.32 శాతం) లాభపడి 11,341.15 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. మార్కెట్ సమయం ముగిసిన తర్వాత వెలువడనున్న రీటెయిల్ ద్రవ్యోల్బణ గణాంకాల కోసం మదుపర్లు వేచిచూసే దోరణిని అనుసరించడంతో స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలకే పరిమితం అయ్యాయని విశే్లషకులు పేర్కొన్నారు. గడచిన సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం మూడేళ్ల కనిష్ట స్థాయి 0.33 శాతానికి సరళతరం అయిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం సెనె్సక్స్ చార్ట్‌లో టాటామోటార్స్ అత్యధికంగా 5.32 శాతం లాభపడింది. అలాగే హెచ్‌పీసీఎల్‌లో వాటాలను విక్రయించే విషయంలో ఓఎన్‌జీసీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించడంతో ఓఎన్‌జీసీ వాటాలు 4.73 శాతం లాభాలను సంతరించుకున్నాయి. అదేవిధంగా భారతి ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్‌పార్మా, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకీ, బజాజ్ ఆటో, టీసీఎస్ సైతం లాభపడ్డాయి. మరోవైపు ఇన్ఫోసిస్ అత్యధికంగా 3.68 శాతం నష్టపోయింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ సంస్ధ లాభాల్లో 2శాతం తగ్గుదల నమోదు చేయడంతో ప్రతికూల ప్రభావం నెలకొంది. అలాగే బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, ఎల్ అండ్ టీ, కోటక్ బ్యాంక్ 2.37 శాతం నష్టపోయాయి. ఇక రంగాలవారీగా చూస్తే బీఎస్‌ఈలో టెలికాం, స్థిరాస్తి, వాహన, చమురు, సహజవాయుల సూచీలు 2.24 శాతం లాభపడ్డాయి. ఐటీ, టెక్, విద్యుత్, కేపిటల్‌గూడ్స్ సూచీలు 0.90 శాతం లాభాలను సంతరించుకోగాబ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం 0.44 శాతం లాభపడ్డాయి. కాగా పండుగ కారణంగా డిమాండ్ పెరగవచ్చన్న ఊహాగానాలతో వాహన, బ్యాంకింగ్ స్టాక్స్ లాభపడగా, ద్రవ్యలభ్యత సమస్య క్రమంలోప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం నష్టపోయాయని ప్రముఖ విశే్లషకుడు వినోద్‌నాయర్ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధి మందగమనాన్ని, గత త్రైమాసిక ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ప్రపంచబ్యాంకు భారత వృద్ధిరేటు అంచనాలను 6 శాతానికి తగ్గించడంతో సోమవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి.
నష్టపోయిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 20 పైసలు కోల్పోయి 71.23గా ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 2.26 శాతం తగ్గి బ్యారెల్ 59.14 డాలర్లు వంతున ట్రైడైంది. కాగా అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయన్న వార్తలతో సోమవారం ఆసియా ఖండంలోని షాంఘై, హాంగ్‌కాంగ్, సియోల్, టోక్యో మార్కెట్లు లాభాల్లో నడిచాయి. ఐరోపా మార్కెట్లు మాత్రం ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలను నమోదు చేశాయి.