బిజినెస్

హలో కాశ్మీర్...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 14: జమ్మూకాశ్మీర్‌లో 72 రోజుల తరువాత పరిస్థితులు కొంత మెరుగవడంతో మొబైల్ పోస్టుపెయిడ్ ఫోన్ సౌకర్యం పునరుద్ధరించారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కేంద్రం అనేక ఆంక్షలు అమలుచేసింది. రాష్ట్ర ప్రజలకు బయట ప్రపంచంతో సంబంధాలు లేవనే చెప్పాలి. మొబైల్ ఫోన్ కనెక్షన్లు అన్నీ నిలిపివేశారు. ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఫోన్ సదుపాయం లేకపోవడంతో తమ వాళ్ల యోగ క్షేమాలు తెలియక కుటుంబ సభ్యులు అల్లాడిపోయారు. కాశ్మీర్ లోయలో ఆగస్టు 5 తరువాత మొబైల్ ఫోన్లు మోగడం మొదలైంది. బయట ప్రాంతాల సంగతి సరేసరి, కనీసం రాష్ట్రంలో ఉన్నవారిని పలకరించడానికే లేకుండాపోయిందని పాత నగరానికి చెందిన బషారత్ అహ్మద్ అన్నారు. స్నేహితులు, బంధువులతో మాట్లాడేందుకే 72 రోజులూ కుదర్లేదని ఆయన చెప్పారు. మొబైల్ ఫోన్ సర్వీసులు పునరుద్ధరించిన గంటలోనే 30 కాల్స్ వచ్చాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ, అలాగే బయట ప్రాంతాల్లో ఉన్న బంధువులతో ఇన్ని రోజులూ మాట్లాడలేకపోయానని, ఇన్నాళ్లూ తాము ఎక్కడున్నామో కూడా తెలియకుండా పోయిందని ఆయన ఆవేదన చెందారు. ప్రపంచమంతా ముస్లింలు జరుపుకునే ఈద్ పర్వదినం నిరాశగానే గడిచిందని, ఎవరికీ శుభాకాంక్షలు చెప్పుకునే పరిస్థితి లేకుండా చేశారని నిఘాత్ షా అన్నారు. రెండు నెలల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలే లేవని ఆమె వాపోయారు. చాలా రోజుల తరువాత మొబైల్ సర్వీసులు పునరుద్ధరించడం సంతోషంగా ఉందన్నారు. ఆమె సోదరుడు మస్రూర్ డెహ్రడూన్‌లో ఉన్న భార్య సుమైరాకు ఫోన్లో ఈద్ శుభాకాంక్షలు తెలిపాడు. అనేక మంది కాశ్మీరీలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇందులో సీనియర్ పోలీసు అధికారులూ ఉన్నారు. ఈద్ ఆగస్టు 12న వచ్చింది. వారం రోజుల పాటు లోయ ప్రాంతంలో సందడి వాతావరణ ఉంటుంది. అయితే రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో స్వేచ్ఛగా మాట్లాడేందుకు వీలుకలిగింది. పోస్టుపెయిడ్ సర్వీసులు మాత్రమే పునరుద్ధరించారు. అలాగే వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు అనుమతిస్తారు. కాగా 25 లక్షల ప్రీపెయిడ్ ఫోన్లు, ఇంటర్నెట్(వాట్సప్ తదితరాలు)పై ఆంక్షలు కొనసాగుతున్నాయి. పోస్టుపెయిడ్ సర్వీసుల పునరుద్ధరణపై కాబోయే పెళ్లి కోడుకు యాసిర్ అహద్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘నా కాబోయే భార్య నేను ఉండే ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫోన్ సర్వీసులు బంద్ చేయడంతో ఆమెతో మాట్లాడేందుకు కుదిరేదికాదు. ఇప్పుడా సమస్య తీరిపోయింది. ఇద్దరూ మాట్లాడుకుంటాం’అని అతడు పేర్కొన్నాడు. వచ్చే శీతాకాలంలోనే అహాద్ పెళ్లి. ఆగస్టు 5కు ముందు గంటల తరబడి ఇద్దరం మాట్లాకునేవారమని యువకుడు పేర్కొన్నాడు.
*చిత్రం...కాశ్మీర్‌లో 70 రోజుల తర్వాత సోమవారం మొబైల్ ఫోన్ సర్వీసులను పునరుద్ధరించడంతో మళ్లీ మొదలైన సందడి