బిజినెస్

‘పీఎంసీ బ్యాంకు స్థితిగతులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ) ఖాతాదారుల ప్రయోజనాలు రక్షిస్తామని రిజర్వు బ్యాంకు గవర్నర్ తన కు హామీ ఇచ్చారని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడిక్కడ తెలిపారు. భారీగా అక్రమాలు చోటుచేసుకున్న ఆ బ్యాంకు పరిస్థితిని తాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని ఆమె తెలిపారు. గత నెలలో పీఎంసీపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా మధ్యాహ్నమే తాను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌తో చర్చలు జరిపానని, ఈ బ్యాంకు ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని దాస్ హామీ ఇచ్చారని నిర్మల చెప్పారు. ప్ర భుత్వ రంగ బ్యాంకుల ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ బ్యాంకు నిధులు రూ. 9వేల కోట్లను దివాళా తీసిన హెచ్‌డీఐఎల్‌కు దాదాపు 70 శాతం రుణాలుగా మంజూరు చేయడం వివాదాస్పదంగా మారింది. కాగా మొండి బకాయిలను రాబట్టేందుకు ప్రభుత్వం తనవంతు కృషి చేస్తోందని, ఇందులో భాగంగా మోసాలకు పాల్పడిన వ్యక్తుల ఆస్తులను జప్తు చేసేందుకు సైతం వెనుకాడేది లేదని మంత్రి నిర్మల స్పష్టం చేశారు. అదేక్రమంలో ఈ ప్రక్రియ ఖాతారులకు చెందిన సొమ్ములు వెనక్కు ఇచ్చేందుకు అడ్డంకి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఈవిషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిజమైన బాధితులకు ఆర్బీ ఐ నుంచి ఏమైనా సహకారం అందించే వీలుంటే అమలు చేయాలని గవర్నర్‌కు తాను సూచించానన్నారు. డిపాజిట్ హామీ పరిమితిని రూ. లక్ష నుం చి మరింతగా పెంచే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. దీనికి పార్లమెంట్ ఆమోదం లభించేలా కృషి చేస్తున్నామన్నారు. తొలుత డిపాజిట్ హామీకి సంబంధించిన రూ. లక్షను ఖాతాదారులకు విడుదల చేయాలని కూడా తాను గవర్నర్ దాస్‌కు సూచించానన్నారు. ఐతే బ్యాంకు పూర్తిగా మూతపడితేగానీ ఇది సాధ్యం కాదని గవర్నర్ చెప్పారని నిర్మల వివరించారు.

*చిత్రం...ఢిల్లీలో సోమవారం జరిగిన ఎనర్జీ ఫోరం సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్