బిజినెస్

ఎవరి విశ్వాసం వారిది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, అక్టోబర్ 11: రాఫెల్ యుద్ధ విమానానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పూజలు చేయడం భారతీయ సంస్కృతిలో భాగమని, ఇదేమి ఎంతమాత్రం మూఢనమ్మకం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాఫెల్ యుద్ధ విమానం చక్రాల కింద నిమ్మకాయలు పెట్టడం, దానిపైన కొబ్బరికాయ ఉంచడం అన్నది భారతీయ సంప్రదాయమని ఆమె తెలిపారు. రాజ్‌నాథ్ చేసిన దాంట్లో తప్పేమిటని ప్రశ్నించిన నిర్మలా సీతారామన్ దేశ ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో ఆత్మవిశ్వాసం కావాలని అన్నారు. ఏ వాహన చక్రాల కిందైనా నిమ్మకాయలు పెట్టడంలో ఉద్దేశం దానిని అవి రక్షిస్తాయనేనని ఆమె వివరించారు. ఎవరికైతే ఇలాంటి వాటిపట్ల విశ్వాసం ఉంటుందో వారెంతమాత్రం వెనక్కి తగ్గరని, రాఫెల్ విషయంలో రాజ్‌నాథ్ చేసింది నూటికి నూరు శాతం సరైనదేనని సీతారామన్ తెలిపారు. భారతదేశంలో ప్రతిఒక్కరూ కూడా కొత్త వాహనం లేదా దేన్నైనా కొన్నపుడు ఈ సంప్రదాయానే్న అనుసరిస్తారని, ఇది దేశ సంస్కృతిలో భాగమని తెలిపారు. గత రక్షణ మంత్రి, ఆయన భార్య భారతీయ సంప్రదాయం ప్రకారమే తమ విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని కొత్త నౌకలను ప్రారంభించారని ఆమె గుర్తు చేశారు. ఆ సమయంలో దానిని మూఢవిశ్వాసంగా ఎవరు పరిగణించారు అని ఆమె అన్నారు. గతంలో ఈ సంస్కృతిని వ్యతిరేకిస్తూ నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు రాఫెల్‌కు రాజ్‌నాథ్ పూజలు చేసిన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. 2017లో ఢిల్లీ మెట్రోను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన మోదీ కార్లపైన నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు ఏది తోస్తే అది పెడతారు. ఇలాంటి వ్యక్తులు దేశానికి ఏరకమైన స్ఫూర్తిని అందిస్తారు అని అన్నారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలను కూడా నిర్మలా సీతారామన్ సమర్థించారు. మూఢనమ్మకాలు, మతవిశ్వాసాలకు సంబంధించి మోదీ మాట్లాడింది సబబేనని పేర్కొన్న సీతారామన్ కేంద్ర ప్రభుత్వం శాస్తవ్రిజ్ఞానాన్ని, శాస్ర్తియ పద్ధతులను అభివృద్ధి చేయడాన్ని విస్మరించలేదని అన్నారు.