బిజినెస్

వ్యవసాయ అనుబంధ సహకార సంస్థలు అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: వ్యవసాయం, దాన్ని అనుబంధ రంగాల సహకార సంస్థలు దేశాన్ని 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే విషయంలో కీలక భూమికను పోషించే స్థితిలో ఉన్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం నాడిక్కడ పేర్కొన్నారు. ఈ సహకార సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లను సైతం అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే 3్భరత అంతర్జాతీయ సహకార వాణిజ్య ప్రదర్శన2ను తోమర్ ప్రారంభించారు. అలాగే 3యువ సహకార్2, ఎన్‌జీవో సహకార్ భారతి పరిధిలోని 3సింప్లీ దేశీ2 బ్రాండ్ల పేరిట అంకుర సంస్థలను సైతం ఆయన ప్రారంభించారు. సహకార సంస్ధల ద్వారా తయారవుతున్న ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ అంకుర సంస్థలు దోహదం చేస్తాయి. కాగా ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చిన 3గావోన్, గరీబ్, కిసాన్2 నినాదం మేరకు గ్రామాలు, పేదలు, రైతుల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా సాగి 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా దేశాన్ని తీర్చిదిద్దే లక్ష్యాన్ని అందుకుందామని వ్యాఖ్యానించారు. మన దేశానికి సహకార సంస్కృతి కొత్తకాదని, కాకపోతే దాన్ని అంతర్జాతీయంగా విస్తరించేందుకు కృషి జరగాలని సూచించారు. ఇష్కో, అముల్ వంటి కొన్ని సహకార సంస్థలు మాత్రమే దేశ వ్యాప్తంగా వాణిజ్యాన్ని విస్తరించి అంతర్జాతీయంగానూ గుర్తింపును పొందాయని తోమర్ తెలిపారు. ఆ స్థాయిని అందుకునేందుకు మిగిలిన సహకార సంస్థలకూ తగిన సమర్థత ఉందన్నారు. వ్యవసాయ సహకార సంస్ధలను ప్రోత్సహించడం ద్వారా అన్నదాతల ఆదాయం ద్విగుణీకృతం అవుతుందని, అంతేకాగా వ్యవసాయోత్పత్తుల ఎగుమలు కూడా 30 బిలియన్ డాలర్ల నుంచి 60 బిలియన్ డాలర్లకు వచ్చే ఐదేళ్లలో పెరగాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. సహకార సంస్థలను పూర్తి స్థాయిలో ప్రోత్సహించేంత వనరులు కేంద్ర ప్రభుత్వం వద్ద లేవని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ వంతు సహకారాన్ని అందజేయాలని తోమర్ సూచించారు.
కేవలం రేషన్ షాపుల నిర్వహణకే సహకార సంస్థలు పరిమితం కారాదన్నారు. ఈ అంతర్జాతీయ సహకార వాణిజ్య ప్రదర్శనలో 120 సహకార యూనిట్లు పాలుపంచుకున్నాయని, వాటికి బ్రాండింగ్, మార్కెటింగ్, సహకార వాణిజ్య విధానంపై పరిపూర్ణమైన అవగాహన కలుగుతుందన్నారు. ఇలావుండగా ఈ వాణిజ్య ప్రదర్శనను జాతీయ సహకారాభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) నేతృత్వంలో బ్యాంకాక్ ప్రధాన కార్యాలయం కలిగిన అంతర్జాతీయ సంస్థ ఎన్‌ఈడీఏసీ, దేశీయ సంస్థలు నాఫెడ్, వ్యవసాయ, వాణిజ్య మంత్రిత్వ శాఖల సహకారంతో ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.