బిజినెస్

వరుసగా 11వ మాసంలోనూ.. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో తగ్గుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశంలో వరుసగా 11వ మాసమైన సెప్టెంబర్‌లో సైతం ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాల్లో తగ్గుదల నమోదైంది. పండుగ సీజన్‌ను సైతం సానుకూలంగా మార్చుకోవడంలో వైఫల్యం చోటుచేసుకుంది. భారత వాహన తయారీదారుల సొసైటీ ‘సియామ్’ శుక్రవారం నాడిక్కడ విడుదల చేసిన ఆందోళన వ్యక్తం చేసింది. ఐతే నవరాత్రోత్సవాల సందర్భంగా వినియోగదారుల్లో సానుకూల దృక్పథం కనిపించిందని, భవిష్యత్తులో ఈ రంగం పుంజుకుంటుందన్న ఆశాభావం నెలకొందని, ఇందుకు కారణం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యలేనని సియామ్ సంతృప్తిని వ్యక్తం చేసింది. తాజా గణాంకాల మేరకు సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 23.69 శాతం తగ్గి మొత్తం విక్రయాలు 2,23,317 యూనిట్లకు పడిపోయింది. గత ఏడాది ఇదే నెలలో 2,92,660 యూనిట్ల విక్రయాలు జరిగాయి. కాగా గడచిన ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మాసాల మధ్య కూడా 3.56 శాతం విక్రయాలు తగ్గాయి. ఆగస్టులో ఐతే మరీ అధ్వాన్నంగా రెండు దశాబ్ధాల కనిష్ట స్థాయికి ఈ వాహనాల విక్రయం పడిపోయింది. ఆ నెలలో కేవలం 31.57 శాతం విక్రయాలు మాత్రమే జరిగాయి. సెప్టెంబర్‌లో దేశీయంగా కార్ల విక్రయాలు 33.4 శాతం తగ్గింది. మోటార్ సైకిళ్ల విక్రయాలు సైతం రెండు దశాబ్ధాల కనిష్ట స్థాయి 23.29 శాతానికి పడిపోయాయని సియామ్ అధ్యక్షుడు రాజన్ వధేరా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన మార్కెట్లున్న ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, మహారాష్టల్ల్రో వరదల కారణంగా విక్రయాలు దెబ్బతిన్నాయన్నారు.