బిజినెస్

సహకార బ్యాంకుల సక్రమ పాలన కోసం చట్టంలో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : సహకార బ్యాంకుల్లో సక్రమ పాలన (నిర్వహణ) జరిగేలా శాసనపరమైన మార్పులు సూచించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడిక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. కుంభకోణాల్లో చిక్కుకున్న పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ) డిపాజిటర్లు, ఖాతాదారుల ఆగ్రహాన్ని, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంత్రి నిర్మల పై ప్రకటన చేశారు. ఆమె దక్షిణ ముంబైలోని బీజేపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశానికి రావడాన్ని గ్రహించిన పీఎంసీ డిపాజిట్లర్లు అక్కడికి చేరుకున్న పెద్దయెత్తున నిరసన నినాదాలు చేశారు. తమ డిపాజిట్లు, ఖాతాల్లోని సొమ్ములను ఇప్పించాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి బాధితులను లోపలికి ఆహ్వానించి వారి కష్టనష్టాలను విన్నారు. అనంతరం మాట్లాడుతూ అవసరమైతే సహకార బ్యాంకుల నిర్వహణకు సంబంధించిన చట్టాలను సవరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఈమేరకు చట్ట సవరణ జరుగుతుందన్నారు. మొత్తం రూ. 4,500 కోట్ల కుంభకోణం జరిగిన పీఎంసీపై ఆర్బీఐ ఆంక్షలు విధించడాన్ని ఆమెవద్ద విలేఖరులు ప్రస్తావించగా ఇలాంటి సహకార బ్యాంకులకు సంబంధించిన నియంత్రణ మార్గదర్శకాలను సైతం మార్పుచేసి మరింత పటిష్టవంతం చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా కేంద్ర ఆర్థిక ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సేవలు, గ్రామీణ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌కు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆమె తెలిపారు. ఈ కమిటీ సూచనల ద్వారా సహకార బ్యాంకుల్లో ఇకపై ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా అవసరమైన శానసపరమైన మార్పులను కేంద్రం చేపడుతుందని నిర్మల తెలిపారు. కాగా పీఎంసీ బాధితుల గోడు తాను విన్నానని, బహుళార్థ రాష్ట్ర సహకార బ్యాంకులు ఆర్బీఐ నిర్వహణలో ఉంటాయని, ప్రభుత్వ ప్రమేయం పరిమితంగానే ఉంటుందని వారికి వివరించానని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తాను ఈ విషయంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌తో చర్చిస్తానని, బాధితుల గోడును ఆయనకు తెలియజేస్తానని ఆమె చెప్పారు. అసలు బాధితులకు సొమ్ము అందే అవకాశాలున్నాయా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ ఆర్బీఐ, బ్యాంకు పాలకవర్గం మధ్య ఇప్పటికే దీనిపై చర్చలు జరిగాయని, ఈప్రక్రియ త్వరగా పూర్తి కావడానికి తనవంతు ప్రయత్నిస్తానని మంత్రి చెప్పారు. కాగా పీఎంసీ కుంభకోణం నేపథ్యంలో ఆరు లక్షల మంది డిపాజిటర్లు ఆందోళనకు గురయ్యారని, ఇప్పుడు మంత్రి ప్రకటనతో తమ సొమ్ములు తిరిగొస్తాయన్న నమ్మకం కలిగిందని ఈ సందర్భంగా ఓ బాధిత డిపాజిటర్ హర్బజన్ సింగ్ తెలిపారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్