బిజినెస్

మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మళ్లీ నష్టాల బాటలోకి మళ్లాయి. బలహీన వృద్ధిరేటు అంచనాలు ప్రధానంగా త్వరలో వెలువడనున్న కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలను ప్రభావితం చేయవచ్చన్న ఆందోళనకు గురైన మదుపర్లు వాటాల విక్రయానికి పాల్పడినట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, వాహన స్టాక్స్ తీవ్ర అమ్మకాల వత్తిడికి గురయ్యాయి. దీంతో ఓ దశలో 370 పాయింట్లు కోల్పోయిన బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఆ తర్వాత కొంత కోలుకుని చివరికి 297.55 పాయింట్ల (0.78 శాతం) నష్టంతో 37,880.40 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 78.75 పాయింట్లు కోల్పోయి 0.70 శాతం నష్టాలతో 11,234.55 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. కాగా మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్ గురువారం తాజాగా భారత్ వృద్ధిరేటు అంచనాలను సవరించింది. ఈ మేరకు 2019-20 జీడీపీ వృద్ధిరేటును గతంలో ఇచ్చిన 6.2 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గించివేసింది. దేశ ఆర్థిక పరిస్థితి నెమ్మదించిందని, ప్రధానంగా దీర్ఘకాలిక ప్రయోజనాలకు కొంతమేర ఇబ్బందులు తలెత్తాయని మూడీస్ నివేదించింది. ఇక త్రైమాసిక ఫలితాల ప్రాతిపదికగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ వాటాలు ఏకంగా 6.5 శాతం భారీ నష్టాలను చవిచూశాయి. రెండోత్రైమాసికంలో లాభాల్లో 52.2 శాతం తగ్గినట్టు ఆ బ్యాంకు నివేదించడంతోబాటు మొండి బకాయిల శాతం పెరిగినట్టు సైతం వెల్లడించింది. ఇక సెనె్సక్స్ ప్యాక్‌లో యెస్ బ్యాంకు, టాటా మోటార్స్, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటాస్టీల్ సైతం 5.21 శాతం అధిక నష్టాలపాలయ్యాయి. మరోవైపు భారతి ఎయిర్‌టెల్ అత్యధికంగా 5.05 శాతం లా భాలను సంతరించుకుంది. వాయిస్ కాల్స్‌పై చార్జి చేయాలని జియో తీసుకున్న నిర్ణయంతో మొత్తం టెలీ కమ్యూనికేషన్ల రంగానికి ప్రయోజనం చేకూరే అవకాశం ఏర్పడటంతో తొలు త ఎయిర్‌టెల్ వాటా లు లాభపడ్డాయి. అంతేకాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్, సన్‌పార్మా, ఏసియన్ పెయిం ట్స్, బజాజ్ ఆటో సైతం 2.76 శాతం లాభాలను సంతరించుకున్నా యి. నిన్నటి లాభా ల బాటను అందుకోవడంలో దేశీయ మార్కెట్లు గురువారం విఫలమయ్యాయి. ఐతే త్వరలో నిఫ్టీ సమీప భవిష్యత్తులోనే 11,100 నుం చి 11,300 పాయింట్లకు ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగం సైతం ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశీయంగా ఆర్థిక స్థితి మందగించడం వల్ల డి మాండ్ తగ్గిందని ఈక్రమంలో అంతర్జాతీయ ఆర్థిక మందగమనం కారణంగా దిగుమతి వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టి కంపెనీల ఆదాయ వృద్ధికి దోహదం చేసే అవకాశాలున్నాయని మరో విశే్లషకుడు సునిల్ తిరుమలై పేర్కొన్నారు. బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.87 శాతం నష్టపోయా యి. ఇక అంతర్జాతీయంగా మదుపర్లు అమెరికా-చైనా వాణిజ్య చర్చల పైనే ప్రధాన దృష్టిని నిలిపి ఆచితూచి వ్యవహరించారు. ఆసియాలో షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్, నిక్కీ సానుకూలంగా ముగియగా, కోస్పి లాభాలను సంతరించుకుంది. ఐరోపా మార్కెట్లు కూడా ఆరంభ ట్రేడింగ్‌లో లాభపడ్డాయి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం స్వల్పంగా పెరిగి 71.04గాట్రేడైంది. ముడిచమురు ధరలు 0.74 శాతం తగ్గి 57.89 బ్యారెల్ 57.89 డాలర్ల వంతున ట్రేడైంది.