బిజినెస్

రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్లో 7 శాతం తగ్గుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: రత్నాలు, బంగారు ఆభరణాల ఎగుమతుల్లో గడచిన ఏప్రిల్ నుంచి ఆగస్టు మాసం వరకు 7 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఈకాలంలో మొత్తం 12.4 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. అంతర్జాతీయం గా అతిపెద్ద మార్కెట్లలో సైతం డిమాండ్ తగ్గడంవల్లే ఈ పరిస్థితి నెలకొంది. ‘రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి’ (జీజేఈపీసీ) గణాంకాల మేరకు గత ఏడాది ఇదే కాలంలో 13.4 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. మొత్తం దేశానికి చెందిన ఎగుమతుల్లో కార్మిక రం గంతో 15 శాతం వరకు ముడిపడి ఉంది. ప్రధానం గా షిప్‌మెంట్‌లో తగ్గుదల చోటుచేసుకోవడానికి బంగారు ఆభరణాలు, రంగుల రత్నాల రాళ్లు, కట్ అండ్ పాలిష్డ్ వజ్రాల ఎగుమతుల్లో తరుగుదలే కారణమని వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఐతే బంగా రు పతకాలు, నాణేలు, వెండి ఆభరణాల ఎగుమతుల్లో మాత్రం 83 శాతం నుంచి 89.4 శాతానికి వృద్ధి చోటుచేసుకుంది. కాగా ఆభరణాలు, రత్నాల ఎగుమతులు మనదేశం నుంచి ప్రధానంగా అమెరి కా, ఐరోపా, జపాన్, చైనాలకు జరుగుతుంటా యి. ఇందులో నాలుగో వంతు అమెరికాకే ఎగుమతులు జరుగుతాయి. గడచిన ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5.4 బిలియన్ డాలర్ల విలువైన వజ్రాలు, 3.4 బిలియన్ల విలువైన బంగారం ఎగుమతులు జరిగాయి.