బిజినెస్

ఐబీహెచ్‌ఎఫ్‌ఎల్, ఎల్‌వీబీ విలీనానికి నిరాకరించిన ఆర్బీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌తో లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీన ప్రతిపాదనను అమలు చేసేందుకు గురువారం రిజ ర్వు బ్యాంకు నిరాకరించింది. దీంతో ఈ రెండు సం స్థల వాటాలు 23శాతం మేర భారీగా నష్టపోయా యి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐబీహెచ్‌ఎఫ్‌ఎల్) స్టాక్స్ ప్రధానంగా 18.65 శాతం నష్టపోయాయి. బీఎస్‌ఈలో ఒక్కో వాటాధర రూ. 195కు పడిపోయింది. ఆరంభ ట్రేడింగ్‌లో ఈ వా టాల విలువ 52 వారాల కనిష్ట స్థాయి రూ. 187.50 కు పడిపోయింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లో సైతం 19.27 శాతం నష్టపోయి ఒక్కోవాటా రూ. 193.60గా ట్రేడైంది. ఓ దశలో ఈవాటా 52 వారాల కనిష్టం రూ. 185.30కి పడిపోయింది. కాగా కంపెనీ మార్కెట్ విలువ సైతం రూ. 1,936.9 కోట్లు కోల్పోయి మొత్తం విలువ రూ. 8,337.69 కోట్లకు పడిపోయింది. ఇక లక్ష్మీ విలాస్ బ్యాంకు వాటాలు సైతం బీఎస్‌ఈలో 5శాతం నష్టం తో ఏడాది కనిష్ట స్థాయి రూ. 25.65గా ట్రేడయ్యా యి. ఎన్‌ఎస్‌ఈలో 4.82 శాతం నష్టపోయి 52 వారా ల కనిష్ట స్థాయి రూ. 25.65లకు పడిపోయింది. కా గా వచ్చే 14న జరిగే బోర్డు సమావేశంలో ఈక్విటీల బైబ్యాక్‌పై నిర్ణయం జ రుగుతుందని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ తెలిపింది.