బిజినెస్

ముగింపు సమయంలో ముంచిన అమ్మకాల ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సైతం నష్టాల పాలయ్యాయి. రోజంతా ఒడిదుడుకుల పాలైన సూచీలు ఆఖరి గంటలో నెలకొన్న అమ్మకాల వత్తిడితో డీలాపడ్డాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, పార్మా, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో సూచీలు నష్టాల్లోకి జారాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 141.33 పాయింట్లు కోల్పోయి 0.38 శాతం నష్టాలతో 37,531.98 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. ఈ ప్యాక్‌లోని 24 వాటాలు నష్టపోయాయి. ఇంట్రాడేలో ఈ సూచీ ఓ దశలో 37,919.47 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 37,480.53 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 48.35 పాయింట్లు (0.43శాతం) నష్టపోయి 11,126.40 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. ఐటీ, పార్మా, ఫైనాన్షియల్, చమురు స్టాక్స్ లాభాల స్వీకరణతో నష్టాలను సంతరించుకున్నాయి. 50 షేర్ల నిఫ్టీలోని దాదాపు 32 కంపెనీలు నష్టపోయాయి.
రెండోత్రైమాసికం ఆదాయ గణాంకాల్లోనూ సవరించిన వృద్ధిరేటు అంచనాలు మరింతగా తగ్గుతాయన్న ఆలోచనల్లో మదుపర్లు ఉన్నారని విశే్లషకులు చెబుతున్నారు. కీలక రంగాలైన వాహన, బ్యాంకింగ్, వౌలిక వసతులు ఇప్పటికే మరీ ఆందోళనకర కనిష్ట వృద్ధిరేటుకు చేరుకున్నాయి. ఈ రంగాల్లో ప్రధానంగా డిమాండ్ లోపించడం స్పష్టంగా కనిపిస్తోందని, ఐతే సోమవారం నాడు జరిగిన వాటాల కొనుగోళ్లు మాత్రం రుతుపవనాల సానుకూల ప్రభావం, కార్పొరేట్ పన్నుల్లో కోత ప్రభావంతోనే జరిగాయని ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ పేర్కొన్నారు. కాగా జాతీయ స్టాక్ ఎక్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లో ప్రధానంగా చమురు రీటెయిలర్ బీపీసీఎల్ అత్యధికంగా 5 శాతం నష్టపోయింది. ఈసంస్థను ప్రైవేటీకరించాలన్న ఆలోచనలోప్రభుత్వం ఉందన్న కథనాలతో సంస్థ వాటాలు నష్టాలపాలయ్యాయి. అలాగే సెనె్సక్స్ ప్యాక్‌లోప్రధానంగా ఓఎన్‌జీసీ, ఐటీసీ, టాటాస్టీల్, ఎం అండ్ ఎం, టాటామోటార్స్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, సన్‌పార్మా, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా అత్యధికంగా 2.97 శాతం నష్టపోయాయి. పార్మా దిగ్గజం ‘గ్లెన్‌మార్క్’ భారీగా 9 శాతం నష్టాల పాలైంది. అమెరికన్ హెల్త్ రెగ్యులేటర్ ఈ సంస్థకు చెందిన హిమాచల్ ప్రదేశ్ తయారీ యూనిట్‌కు హెచ్చరికలు జారీచేసిన క్రమంలో సంస్థ వాటాలు ప్రతికూలంగా మారాయి. అలాగే అరిబిందో పార్మా అతి భారీగా 19 శాతం నష్టపోయింది. అమెరికన్ ఆరోగ్య నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఈ పార్మా కంపెనీకి చెందిన ఒక ప్లాంటు మంచి తయారీ మార్గదర్శదర్శకాలను విస్మరించిందంటూ ప్రత్యేక పరిశీలన ఏర్పాటు చేసిందన్న వార్తలు ఆ సంస్థ వాటాలను నష్టాల్లోకి నెట్టాయి. దీనిపై అరబిందో పార్మా క్లారిఫికేషన్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. అలాగే మరో పార్మా కంపెనీ లుపిన్ 2.69 శాతం నష్టపోగా, సిప్లా 2.35 శాతం, సన్ పార్మా 1.57 శాతం వంతున నష్టపోయాయి. ఐతే ఐటీ వాటాలు మాత్రం త్రైమాసిక ఫలితాలతో బలపడ్డాయి. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సైతం 7.52 శాతం నష్టాల పాలైంది. ఈ సంస్థలోని సీడీఎస్‌ఎల్ డిపాజిట్ల షేర్‌హోల్డింగ్‌ను ప్రమోటర్స్ స్తంభింపజేయడంతో జరిగిన ఆర్థిక గణాంకాల విడుదల జాప్యంతో వాటాలకు నష్టం వాటిల్లిందని విశే్లషకులు తెలిపారు. మరోవైపు కొత్త పెట్టుబడులు రానున్నాయన్న అంచనాలతో యెస్ బ్యాంకు 8శాతం లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, భారతి ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరోమోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్ 2.53 శాతం లాభపడ్డాయి. మొత్తం మార్కెట్లలో 1,629 వాటాలు నష్టపోగా, 892 వాటాలు లాభపడ్డాయి.
నష్టాల్లో విదేశీ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో కోస్పి మాత్రం లాభాలను నమోదు చేయగా, నిక్కీ నష్టాలను నమోదు చేసింది. షాంఘై, హాంగ్‌కాంగ్ మార్కెట్లకు సోమవారం సెలవుదినం. ఇక ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలనే నమోదు చేశాయి. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 18 పైసలు నష్టపోయి 71.07గా ట్రేడైంది. ముడిచమురు ధరలు 0.41 శాతం పెరిగి బ్యారెల్ 58.61 డాలర్ల వంతున ట్రేడైంది.