బిజినెస్

స్విస్ ఖాతాల వివరాలు వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/బెర్నే, అక్టోబర్ 7: స్విస్‌బ్యాంకు ఖాతాల వివరాలు భారత్‌కు అందాయి. విదేశీ బ్యాంకులో కుదవబెట్టిన నల్లధనం వెనక్కితెప్పిస్తామని నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. స్విస్ ఖాతాల వివరాలు భారత్‌కు చేరడం ద్వారా ప్రయత్నాలకు తొలి అడుగుగా చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి పద్ధతి కింద ఖాతాల వివరాలు స్విస్ అందజేసింది. నల్లధనంపై మోదీ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఇదో మైలురాయిగా చెప్పవచ్చు. భారత్‌కు ఖాతాల వివరాలు అందించినట్టు స్విట్జర్లాండ్ ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) ప్రతినిధి వెల్లడించారు. ఆటోమెటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్(ఎప్పటికప్పుడు సమాచారం అందించికునే ప్రక్రియ) కింద తొలిసారి వివరాలు భారత్‌కు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. 2018 సంవత్సరంలో ముగిసిని ఖాతాల వివరాలు అందజేశారని అన్నారు. అయితే వివరాలు గోప్యంగా ఉంచుతారు. అలాగే 2020 సెప్టెంబర్ నాటికి మరోవిడత ఖాతాల జాబితా ఇస్తామని ఎఫ్‌టీఏ ప్రతినిధి ప్రకటించారు. ఇది అత్యంత రహస్యంగా ఉంచాలన్న నిబంధనల వల్ల వివరాలు బయటకు వెల్లడించలేమని అధికారులు తెలిపారు. తమ దేశంలోని భారతీయ ఖాతాదారులకు సంబంధించి వివరాలు అందులో ఉన్నాయి. ఖాతాదారుల్లో ఎక్కువ
మంది వ్యాపారులు, ఎన్నారైలు ఉన్నట్టు తెలిసింది. నల్లధనం కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో అనేక మంది తమ ఖాతాలను మూసేశారు. తొలి విడతలో అందించిన ఖాతాల్లో ఎక్కువ అవే ఉన్నట్టు భావిస్తున్నారు. ఖాతాదారుని పేరు, చిరునామా, ఏ రాష్ట్రంలో ఉంటుంది, టాక్స్ గుర్తింపునెంబర్ ఉన్నాయి. అలాగే బ్యాలెన్స్, మూలధన ఆదాయం, సంస్థ పేర్లు పొందుపరిచారు. భారత్‌తోపాటు 63 దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారం మార్చుకునే ఒప్పందాన్ని చేసుకున్నట్టు స్విస్ వెల్లడించింది. దీన్లో భాగంగానే ఆయా దేశాలకు వేర్వేవేరుగా ఖాతాల వివరాలు అందజేసినట్టు తెలిపింది.