బిజినెస్

దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ సర్వీస్‌లకు అదనంగా హైదరాబాద్ నుంచి 110, బెంగళూరు నుంచి 30, చెన్నై నుంచి 10 సర్వీసులను అందుబాటులోకి తెచ్చామన్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఏపీకి రాకపోకల్లో తీవ్ర అంతరాయం కలుగుతోంది. రాష్ట్రం నుంచి కూడా కొన్ని ఆర్టీసీ సర్వీసులను తెలంగాణకు పంపారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇలీబన్, దిల్‌సుఖ్‌నగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఎండీ కృష్ణబాబు వివరించారు.