బిజినెస్

గ్రామీణ, నగర అనుబంధ ప్రాంతాల్లో వాణిజ్య విస్తరణపై ‘పే వరల్డ్’ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఫిన్‌టెక్ సంస్థ ‘పే వర ల్డ్’ వాణిజ్య విస్తరణపై దృష్టి నిలిపింది. గ్రామీణ ప్రాంతాలు, నగరాల అనుబంధ ప్రాంతాల్లో రీటెయిల్ టచ్ పాయింట్లను ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది. డిజిటల్ లావాదేవీల్లో నెలకొన్న వృద్ధిని సానుకూలంగా మలుచుకుని వచ్చే ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించాలన్న కృతనిశ్చయానికి వచ్చింది. ఈ సంస్థ ప్రస్తుతం డొమెస్టిక్ మనీ రెమిటెన్స్, మొబైల్, టీటీహెచ్ చార్జింగ్, రవాణా రిజర్వేషన్లు, వినిమయ బిల్లు వసూళ్లను డిజిటల్ వ్యాలెట్లు, క్యాష్ విత్‌డ్రాయల్ పాయింట్ల ద్వారా నిర్వహిస్తూ ఈ-కామర్స్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది. కాగా రిజర్వు బ్యాంకు ఆమోదం పొందిన ‘ప్రీ పెయిడ్ ఇన్‌స్ట్రమెంట్’(పీపీఐ) జారీదారుగా ఉన్న ‘పేవర్డ్ మనీ’ సంస్థకు ‘పేవరల్డ్’ అనుబంధ సంస్థ అని, ఇది పూర్తి స్వేచ్ఛగా పనిచేస్తోందని ’పే వరల్డ్’ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ దబాయ్ ఆదివారం నాడిక్కడ తెలిపారు. తమ కంపెనీ వాణిజ్య విస్తరణలో భాగంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కొత్త ఏజెంట్ల నియామాకాన్ని చేపడుతుందని ఆయన తెలిపారు. ప్రధానంగా చిన్నచిన్న దుకాణాల నిర్వాహకులు ఈ టచ్‌పాయింట్లను నిర్వహించడం ద్వారా నెలకు రూ.5వేల నుంచి 20 వేల వరకు ఆర్జించవచ్చని ఆయన తెలిపారు. కాగా వినియోగదారుల ఆధార్ వివరాలను, ఈ-కేవైసీని పరిశీలించే అధికారాన్ని ఫిన్‌టెక్ కంపెనీలకు కూడా ఇవ్వాలని ఆయన కోరారు.