బిజినెస్

ఇక కొత్త వార్షిక బడ్జెట్ అంచనాలపై కేంద్రం కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21 బడ్జెట్ అంచనాల రూపకల్పనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈనెల 14 నుంచి కసరత్తును ప్రారంభించనుంది. ఈ వార్షిక బడ్జెట్‌లోప్రధానంగా పలు క్లిష్టతర సవాళ్లు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నాయి. ఇందులో మరీ ముఖ్యమైంది ఆర్థిక మాంద్యం. వృద్ధిరేటుకు ప్రతిబంధకంగా మారి ఆదాయానికి గండికొడుతున్న ఈ సమస్యను చక్కదిదేందుకు అనేక సంస్కరణలు, ఇతర ఉద్దీపన చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం తదుపరి ఏమి చర్యలు చేపడుతుందన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇది రెండో బడ్జెట్ కావడం విశేషం. ఈక్రమంలో బడ్జెట్‌కు ముందు నిర్వహించే ప్రీ బడ్జెట్, రివైజ్డ్ (సవరించిన) అంచనాలకు సంబంధించిన సమావేశాలు ఈనెల 14 నుంచి ఆరంభం కానున్నాయి. ఈ సమావేశాలు సవంబర్ మొదటి వారం వరకు కొనసాగుతాయి. ఆర్థిక సలహాదారులందరూ ‘కేంద్ర బడ్జెట్ సమాచార విధానం’ (యూబీఐఎస్) రీ మోడ్యూల్ పరిధిలో జరిగే ఈ సమావేశాల్లో తమ అమూల్యమైన సలహాలను అందజేస్తారు. ఈమేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం బడ్జెట్ డివిజన్ నుంచి ఆదివారం వారంనాడిక్కడ ఓ సర్క్యులర్ వెలువడింది. వ్యయానికి సంబంధించిన వివరాలపై మం త్రిత్వ కార్యదర్శి ఇతర ఆర్థిక కార్యదర్శులు, సలహాదారులతో చర్చించిన అనంతరం 2020-21 బడ్జెట్‌కు సంబంధించిన ప్రాథమిక అంచనాలకు పూర్తిస్వరూపం ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది. ఈ బడ్జెట్ అంచనాల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ ట్రైబ్‌ల సబ్‌ప్లాన్లు, లింగవివక్షకు గురైన వారు. చిన్నపిల్లలకు సంబంధించిన బడ్జెట్ స్టేట్‌మెంట్లు భర్తీచేసే అంశం కొత్తగా చర్చకు వచ్చే అవకాశం ఉందని ఆ సర్క్యులర్ వివరించింది. వచ్చే 2020 ఫిబ్రవరి 1న ఈ బడ్జెట్‌ను లోక్‌సభలోప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. 2017 ఫిబ్రవరి 1న అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తొలిసారిగా వార్షిక బడ్జెట్ పద్దును లోక్‌సభలోప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభ మాసమైన ఏప్రిల్ నుంచి మంత్రిత్వ శాఖలు బడ్జెట్ కేటాయింపులు జరిపాయి. ఇందువల్ల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వ్యయంపై సమీక్ష చేసుకునేందుకు వీలవుతుంది. అలాగే కంపెనీలు సైతం అప్పటికప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార, పన్ను నిర్వహణపై ప్రణాళికలు రూపొందించుకోవడానికి వీలుకలుగుతుందని ఆర్ధిక శాఖ సర్క్యులర్ వివరించింది. గడచిన ఫిబ్రవరి నెలాఖరులోప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మూడు దఫాల పార్లమెంట్ ఆమోద విధానాన్ని అనుసరించడం జరిగింది. గడచిన మేనెల మధ్యకాలంలో ఈ తంతును ముగిసింది. ఆ తర్వాత రుతుపవనాల కారణంగా కురిసిన వర్షాల కారణంగా ఆలస్యమైన ఈప్రక్రియతో గడచిన ఆగస్టు మాసాంతం లేదా సెప్టెంబర్ నుంచే వివిధ ప్రాజెక్టులకు నిధులు ఖర్చుచేసే పరిస్థితులు నెలకొన్నాయి.