బిజినెస్

వడ్డీ రేట్లు మరింత తగ్గొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, అక్టోబర్ 5: భారత్‌లో కీలక వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న డీబీఎస్ బ్యాంక్ అంచనా వేసింది. డిసెంబర్‌లోనూ, తరువాత 2020లోనూ వడ్డీ రేట్ల తగ్గింపు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఇటీవలి కాలంలో కీలక వడ్డీ రేట్ల తగ్గింపును ప్రారంభించిన రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం వరుసగా అయిదోసారి రెపో రేట్‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటి తీసుకున్న ఈ నిర్ణయంపై వ్యాఖ్యానిస్తూ భారత్‌లో సమర్థవంతమయిన విధాన ప్రసారం కోసం రెపో రేట్‌ను తగ్గించడంతో పాటు మరిన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని డీబీఎస్ బ్యాంక్ పేర్కొంది. విపణి చోదిత వడ్డీ రేట్లు, అదనపు ద్రవ్యలభ్యత పరిస్థితులు, తీసుకున్న అప్పులపై తక్కువ వ్యయం వల్ల అన్ని రంగాలు లబ్ధి పొందేందుకు వీలు కల్పించే స్థిరమయిన ఆర్థిక వ్యవస్థ అవసరమని అభిప్రాయపడింది. అన్ని బ్యాంకులు అక్టోబర్ ఒకటో తేదీనుంచి రెపో రేట్ ఆధారంగా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను సవరించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఇప్పటికే చాలామట్టుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రెపో రేట్‌కు తమ వడ్డీ రేట్లను అనుసంధానించాయని డీబీఎస్ పేర్కొంది. అయితే, ఆర్థిక స్థిరత్వమనేది ఎంతో ప్రాధాన్యత గల అంశమని అభిప్రాయపడింది.
గత అయిదు సంవత్సరాలుగా అనేక సవాళ్లను ఎదుర్కొన్న భారత బ్యాంకింగ్ రంగం నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏల) నిష్పత్తి 2019 మార్చిలో 10.3 శాతానికి తగ్గిందని తెలిపింది. అంతకు ముందు ఎన్‌పీఏల నిష్పత్తి అత్యధికంగా 11.2 శాతం ఉండిందని పేర్కొంది. ఇలాంటి విపత్కర పరిస్థితి నుంచి బయటపడే అవకాశాలు ఉన్నప్పటికీ, తాజా ఆందోళనలు నెలకొన్నాయని పేర్కొంది. ఒత్తిడిలో ఉన్న రంగాలు- స్థిరాస్తి, నిర్మాణం, టెలికాం వంటి వాటిలో రేటింగ్ మరింత పడిపోయే అవకాశాలు ఉన్నాయని డీబీఎస్ తెలిపింది. అదే గనుక జరిగితే దాని ప్రతికూల ప్రభావం బ్యాంకుల పుస్తకాలపైనా పడుతుందని పేర్కొంది. అంతేకాకుండా బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థల బ్యాలెన్స్ షీట్లు ఇబ్బందుల్లో పడుతున్న వార్తలు వస్తున్నాయని తెలిపింది. ఆర్‌బీఐ శుక్రవారం కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం వల్ల రెపో రేట్ 5.15 శాతానికి దిగివచ్చింది. ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసికెళ్లడానికి కీలక వడ్డీ రేట్లలో కోత విధించడం ప్రధానమయని చర్య అని డీబీఎస్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆర్థికవేత్త రాధికారావు పేర్కొన్నారు.