బిజినెస్

జీఎస్‌టీతో ధరలు తగ్గాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: జీఎస్‌టీ వల్ల ధరలు తగ్గాయని, ఈ పన్ను వల్ల దేశంలోని అన్ని అమ్మకం పన్నులను ఏకీకృత వ్యవస్థ పరిధిలోకి తెచ్చామని కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం ఇక్కడ జరిగిన బ్యాంకుల రుణమేళా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముద్రబ్యాంక్ కింద కోట్ల మంది చిన్న, మధ్య తరగతి వ్యాపపారులకు రుణ సాయం అందుతుందన్నారు. చైనా, అమెరికా మధ్య వాణిజ్య వివాదాలు ఉన్నప్పటికీ, భారత్ ఆర్థిక రంగంలో దూసుకెళ్లుతోందన్నారు. కార్పొరేట్
పన్నును తగ్గించి ప్రపంచంలోని పెట్టుబడీదారులు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. దేశంలో 200 సెల్‌ఫోన్ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులకు సమాయత్తమవుతున్నాయని తెలిపారు. రుణాలను సకాలంలో చెల్లించి, మళ్లీ రుణాలు తీసుకోవాలని కస్టమర్లకు సూచించారు. రానున్న రోజుల్లో రుణ మేళాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. కేంద్రం ఇంత వరకు ముద్రా పథకం ద్వారా రూ. 7.23లక్షల కోట్ల మేర రుణాలు మంజూరుచేసిందన్నారు. దేశ నిర్మాణంలో, ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలదే కీలకపాత్ర అన్నారు. దేశంలోని పోస్ట్ఫాసులను, సబ్ పోస్ట్ఫాసులను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులుగా మార్చి బ్యాంకింగ్ సేవలను ఇంటి వద్దకే తెచ్చామన్నారు. ప్రజలను ఆర్థిక సవ్రంతిలోకి తీసుకురావాలని 1969లో బ్యాంకులు విలీనం చేసినా ఆ లక్ష్యం నెరవేరలేదని, కానీ మోదీ తీసుకున్న నిర్ణయాలు ఆలోచనలు లక్ష్యసాధన దిశగా సాగుతున్నాయని వివరించారు. దేశంలో 28.44 కోట్ల మందికి రూపే డెబిట్ కార్డులను జారీ చేశామన్నారు. దేశ వ్యాప్తంగా 19.71 కోట్ల మహిళలు జన్‌ధన్ ఖాతాలు కలిగి ఉన్నారన్నారు. ఇది మొత్తం ఖాతాల్లో 51 శాతమని చెప్పారు.