బిజినెస్

ఇక రుణాలు మరింత చవక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 4: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వరుసగా అయిదోసారి శుక్రవారం కీలక వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల గృహ, వాహన, ఇతర రుణాలు చవకగా లభించనున్నాయి. ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును పునరుద్ధరింప చేయడానికి తన దూకుడు చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ వరుసగా అయిదోసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించి రికార్డు సృష్టించింది. దీంతో వడ్డీ రేట్లు దాదాపు గత దశాబ్ద కాలంలో కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటి (ఎంపీసీ)లోని మొత్తం ఆరుగురు సభ్యులు వడ్డీ రేట్ల తగ్గింపు వైపునకే మొగ్గు చూపారు. ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై విధించే వడ్డీ రేటు (రెపో రేట్)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, 5.15 శాతానికి చేర్చింది. గతంలో 2010 మార్చిలో రెపో రేటు రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయి 5శాతంగా నమోదయింది. కీలక వడ్డీ రేట్ల తగ్గింపు తరువాత ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీ రేటు (రివర్స్ రెపో రేట్) 4.9 శాతానికి చేరింది. ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ అంచనా వృద్ధి రేటును గతంలో పేర్కొన్న 6.9 శాతం నుంచి ఇప్పుడు 6.1 శాతానికి తగ్గించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు గతంలో అంచనా వేసిన 5శాతం కన్నా తక్కువగా నమోదు కావడం, తరువాత త్రైమాసికంలోనూ తగినంతగా పెరగకపోవడం వల్ల ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సర జీడీపీ అంచనా వృద్ధి రేటును తగ్గించింది. ప్రస్తుత పండుగల సీజన్‌లో గృహ, వాహన తదితర రుణాల వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా ప్రజల వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఆర్‌బీఐ రెపో రేట్‌ను తగ్గించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పుంజుకునే వరకు ఎంపీసీ ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత పరిమితికి లోబడి ఉంచుతూనే చవకగా రుణాలు అందించే తన వైఖరిని కొనసాగిస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆర్‌బీఐ రెపో రేట్‌ను 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు గత నాలుగుసార్లు కలిపి మొత్తం 110 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనివల్ల ప్రజలు తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గాయి. ఇదే కాలంలో వాణిజ్య బ్యాంకుల తాజా రూపీ రుణాలపై వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్ (డబ్ల్యూఏఎల్‌ఆర్) 29 బేసిస్ పాయింట్లు తగ్గింది. అయితే, బకాయి ఉన్న రూపీ రుణాలపై డబ్ల్యూఏఎల్‌ఆర్ 7 బేసిస్ పాయింట్లు పెరిగింది.