బిజినెస్

బ్యాంకుల మనుగడపై ఆందోళన వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 4: ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల మనుగడపై వస్తున్న ఆందోళనకర వార్తలను నమ్మవద్దని, సహకార బ్యాంకుల సహా ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చిన ప్రమాదమేదీ లేదని రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం నాడిక్కడ భరోసా ఇచ్చారు. బ్యాంకులు ఆర్థికంగా బలోపేతంగా, స్థిరత్వాన్ని కలిగివున్నాయని ఆయన పేర్కొన్నారు. పంజాబ్ మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ)లో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా బ్యాంకింగ్ వ్యవస్థలో లోటుపాట్లను సరిదిద్దేందుకు, సహకార బ్యాంకుల నియంత్రణ చట్టాల మార్గదర్శకాల్లో మార్పులు చేయదలిచామని, దీనిపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని ఆయన తెలిపారు. ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఆ బ్యాంకు నియంత్రణ పరిధిలోకి వచ్చిన బ్యాంకుల్లో పీఎంసీ 24వది కావడంతో బ్యాంకుల భవితవ్యంపై ఇబ్బడిముబ్బడిగా వార్తా కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన ఆర్బీఐ గవర్నర్ పై వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రాజకీయ జోక్యం బ్యాంకుల్లో పెరిగిపోయిందని, దీంతో నియంత్రణ, పాలనాపరమైన లోటు నెలకొందని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల్లో ఆర్బీఐ నియంత్రణ పర్యవేక్షణకే పరిమితమని, తనిఖీలు నిర్వహించి లోటుపాట్లపై, ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సక్రమ మార్గదర్శకాలు నిర్దేశిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ద్రవ్య వినిమయ విధాన సమీక్షా కమిటీ సమావేశం సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ విలేఖరులతో మాట్లాడారు. అసత్య వార్తలపై దృష్టి నిలిపి సమయం వృథా చేసుకోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పీఎంసీపై ఆంక్షలు, దివాళాదీసిన స్థిరాస్తి సంస్థ హెచ్‌డీఐఎల్‌పై చర్యలపై దాస్ మాట్లాడుతూ ఈ విషయంలో ఆర్బీఐ తన పరిధి మేరకు నడుచుకుందని, గత మేనేజ్‌మెంట్‌ను పక్కన పెట్టి ఆ నగర సహకార బ్యాంకుకు ప్రత్యేక పాలకుడిని నియమించామని గుర్తు చేశారు. ‘అసలు ఎలాంటి సహకార బ్యాంకు సంక్షోభంలో చిక్కుకునేందుకు ఆర్బీఐ అంగీకరింబోద’ని దాస్ స్పష్టం చేశారు. తొలగించిన ఎండీ జోయ్ థామస్ చేసిన ఆరోపణలపై విలేఖరులు అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ పీఎంసీకి సంబంధించిన అంశాలపై ఈఓడబ్ల్యు దర్యాప్తు సాగుతోందని, ఈక్రమంలో ఇంతకుమించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలుచుకోలేదని ఆయన తెలిపారు. కాగా ప్రస్తుతం లక్ష వరకు ఉన్న డిపాజిట్ ఇన్సూరెన్స్ పరిమితిని పెంచే అవకాశాలున్నాయా అన్న ప్రశ్నకు అక్కడే ఉన్న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్‌ఎస్ విశ్వనాథన్ సమాధానమిస్తూ దీనిపై డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి నిర్ణయమేదీ తీసుకోలేదన్నారు.