బిజినెస్

ఆర్బీఐ రెపోరేట్ల కోత కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లను బెంచ్‌మార్క్‌కన్నా మరింత తక్కువ చేస్తూ రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి చేయూతనిచ్చేలా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం నాడిక్కడ పేర్కొంది. ఆర్థిక ఉద్దీపన నిమిత్తం కార్పొరేట్ పన్నుల కోత వంటి చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ బాసటగా నిలుస్తోందని ఆ మంత్రిత్వ శాఖ కితాబిచ్చింది. మరోదఫా 25 బేసిస్ పాయింట్ల మేర రెపోరేట్లలో కోత విధిస్తూ శుక్రవారం ఉదయం ద్రవ్య విధాన నిర్ణాయక కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశంలో నిర్ణయం జరిగింది. వెనువెంటనే స్పందించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. గత ఆగస్టు 23న ఆరేళ్ల కనిష్టానికి చేరిన వృద్ధిరేటు, 45 ఏళ్ల గరిష్టానికి చేరిన నిరుద్యోగ సమస్యను సరిదిద్దేందుకు చేపట్టిన పలు ఉద్దీపన చర్యలను కేంద్రం గుర్తు చేసింది. కార్పొరేట్ పన్నుల్లో 10 శాతాన్ని తగ్గించిన విషయాన్నీ ఆ ప్రకటనలోప్రస్తావించింది. విదేశీ పెట్టుబడులపై సమకూరే ఆదాయాలపై పెంచిన సుంకాన్ని సైతం ఉపసంహరించామని తెలిపింది. అలాగే తాజాగా ఈ ఆర్థిక సంవత్సరానికి సవరించిన వృద్ధిరేటు అంచనాలు 6.1 శాతంను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని, అదే సమయంలో ఐఎంఎఫ్, ఏడీబీ వంటి ఇతర సంస్థల అంచనాలను సైతం పరిశీలిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోద్రవ్యోల్బణం మరింతగా పెరుగుతుందన్న రిజర్వు బ్యాంకు ద్రవ్య విధాన నిర్ణయక కమిటీ (పీఎంసీ) సూచనలు కూడా పరిశీలిస్తున్నామని, ఇది కూడా ఏమంత ఆందోళనకరం కాదని, ప్రభుత్వ లక్ష్య పరిధిలోనే ఉందని స్పష్టం చేసింది.