బిజినెస్

మరోదఫా మధ్యంతర డివిడెండ్ డిమాండ్‌పై సమాచారం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 4: కార్పొరేట్ పన్నుల కోత, విదేశీ పెట్టుబడులపై సుంకాల వెసులుబాటు వంటి చర్యలతో ఏర్పడిన ఆదాయ లోటును పూడ్చుకునేందుకు కేంద్రం మరోదఫా మధ్యంతర డివిడెండ్‌ను ఆర్బీఐ నుంచి కోరుతుందన్న విషయంపై తనకెలాంటి సమాచారం లేదని ఆ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతంలో మరో దఫా దాదాపు రూ.30వేల కోట్ల మేర ఆర్బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్‌గా కేంద్రం సమీకరిస్తుందని అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘నేను కూడా మీడియాలో ఆ వార్తలు చూశాను. ఐతే ప్రభు త్వం నుంచి అలాంటి డిమాండ్ వస్తుందన్న విషయంపై నాకు అవగాహన లేద’ని ఆయన బదులిచ్చారు. గతంలో 2017-18లో రూ. 10వేల కోట్లు మధ్యంతర డివిడెండ్‌గా బదలాయించిన రిజర్వు బ్యాంకు గత నెలలో మరో రూ. 1,76,051 కోట్లు తమ అదనపు నిధుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 52,637 కోట్లు ప్రభుత్వానికి బదలాయించవచ్చని సవరించిన మూలధన నిల్వల పరిమితి మార్గదర్శకాలు (ఈసీఎఫ్) ద్వా రా తేలిందని తెలిపింది. ఈ ఏడాది ఇప్పటికే ఆర్బీఐ రూ. 28వేల కోట్లు మధ్యంతర డివిడెండ్‌గా గత మార్చి నెలలో విడుదల చేయడం జరిగింది.