బిజినెస్

వాణిజ్య చట్టంలో త్వరలో కీలక మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: వాణిజ్యానికి సంబంధించి తలెత్తిన వివాదాలు, సమస్యల పరిష్కారానికి చట్టంలో మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వ్యర్థాల డంపింగ్ నియంత్రణ, పటిష్ట్భద్రత (యాంటీ డంపింగ్ అండ్ సేఫ్‌గార్డ్) నిబంధనలను మార్చి మరింత పటిష్టవంతంగా అమలు చేయాలని తీర్మానించింది. దేశీయంగా పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని సంబంధిత అధికారి ఒకరు ఆదివారం నాడిక్కడ తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అమోదం తెలిపిందని ఆ అధికారి వెల్లడించారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటీవో) నిబంధనల మేరకు ఈ ప్రతిపాదనలను రూపొందించడం జరిగిందని, దిగుమతి వస్తువుల శాతం పెరుగుతున్న దృష్ట్యా వాటి డంపింగ్ కారణంగా తలెత్తే సమస్యల నుంచి దేశీయ పరిశ్రమలను రక్షించడమే దీని ప్రధానోద్దేశ్యమని తెలిపారు. ప్రత్యేకించి సబ్సిడీలతో కూడుకున్న వస్తువుల దిగుమతి విషయంలో ఈ మార్పులు జరగాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈమార్పులో భాగంగా ప్రభుత్వం తక్కువ సుంకాల వసూళ్లు (ఎల్‌డీఆర్)కు స్వస్తి చెబుతుందన్నారు. ఇందువల్ల భారత పరిశోధనా సంస్థలకు సరికొత్త ఆంటీ డంపింగ్ దిగుమతిపై పూర్తి స్థాయి సుంకాలను నిర్ధారించేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. అలాగే సేఫ్‌గార్డ్ నిబంధనల్లో టారిఫ్ రేట్ కోటాను కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆ అధికారి తెలిపారు. అలాగే దేశీయ వస్తువులకు విధించే కౌంటర్‌వ్యాలింగ్ డ్యూటీ (సీవీడీ) విధానంలో కూడా సుంకం చెల్లించకుండా తప్పించుకోలేని ‘యాంటీ సర్కంవెన్షన్’ విధానాన్ని తీసుకురావడం జరుగుతోందన్నారు. ప్రత్యేకించి తయారీ రంగంలో వృద్ధిని పాదుకొల్పి, విస్తరించి ‘మేకిన్ ఇండియా’ నినాదాన్ని సాకారం చేసేందుకే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని ఆ అధికారి స్పష్టం చేశారు.