బిజినెస్

361 వౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంలోని సుమారు 361 వౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం కారణంగా రూ. 3.77 లక్షల కోట్ల అదనపు ఆర్ధిక భారం పడిందని ఆదివారం నాడిక్కడ విడుదలైన సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. ఈప్రాజెక్టులన్నీ ఒక్కొక్కటి రూ. 150 కోట్ల తొలి ఖర్చు అంచనాలతో కూడుకున్నవని ఆ నివేదిక స్పష్టం చేసింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల సమాచార మానిటర్స్ వౌలిక వసతుల ప్రాజెక్టుల విభాగం పరిధిలోని మొత్తం 1,623 ప్రాజెక్టుల్లో ఈ 361 ప్రాజెక్టులు ఆలస్యంకాగా, మరో 496 నిర్దేశిత కాల వ్యవధిలోనూ నిర్మాణాన్ని పూర్తి చేసుకోనున్నాయి. మొత్తం 1623 ప్రాజెక్టులకు రూ. 199,25,107.47 కోట్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనా వేసినట్టు సంబంధిత మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. గత మేనెల వరకు ఈ ప్రాజెక్టులపై రూ. 8,91,512.91 కోట్ల మొత్తం ఖర్చు చేయడం జరిగిందని, ఇది ఆ ప్రాజెక్టుల ఖర్చు అంచనాల్లో 38.72 శాతమని నివేదిక తెలిపింది. ఐతే ఆలస్యమవుతున్న ప్రాజెక్టు సంఖ్యలో తగ్గుదల నెలకొందని ఈ ఏడాది ఆఖరుకు ఈ ప్రాజెక్టుల సంఖ్య 399గా నమోదుతుందని ఆ నివేదిక అంచనా వేసింది. మొత్తం 684 ప్రాజెక్టులు నిర్ణీత కాలవ్యవధిలోగా పూర్తయ్యే అవకాలున్నాయని పేర్కొంది. కాగా ఆలస్యం చోటుచేసుకున్న మొత్తం 496 ప్రాజెక్టుల్లో 166 ప్రాజెక్టులు అన్ని విధాలుగా ఆలస్యాన్ని ఎదుర్కొంటూ కనీసం 12 నెలల ఆలస్యం జరిగే పరిస్థితి నెలకొంది. 105 ప్రాజెక్టులు 13 నుంచి 24 నెలలు, 128 ప్రాజెక్టులు 25 నుంచి 60 నెలల వరకు, 97 ప్రాజెక్టులు 61 నెలలు ఆపైన ఆమస్యమయ్యే అవకాశాలున్నాయని నివేదిక వివరించింది. ఈ అన్ని ప్రాజెక్టుల కనీస ఆలస్య వ్యవధి 36.98 నెలలుగా తేలిందని నివేదిక తెలిపింది.