బిజినెస్

1000 కంపెనీలకు రూ. 37 వేల కోట్ల ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పన్ను కోత నిర్ణయం వల్ల స్టాక్ మార్కెట్ జాబితాలోని మరో 1000 అగ్రశ్రేణి కంపెనీలకు రూ. 37 వేల కోట్ల మేర ఆదా అవుతుంది. ఈమేరకు ఆదివారం నాడిక్కడ విడుదలైన ‘క్రెడిట్ రేటింగ్స్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా’ (క్రిసిల్) అధ్యయన నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టేందుకు గడచిన కొనే్నళ్లలో కేంద్ర ప్రభుత్వం అనేక ఉద్దీపన చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాలుగో దఫాగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలు మంచి ఫలప్రదమైనవిగా భావిస్తున్నామని, తమ విశే్లషణలో వెయ్యి లిస్టెడ్ కంపెనీలు రూ. 37 వేల కోట్లమేర లాభపడతాయని తేలిందని ఆ నివేదిక వెల్లడించింది. లబ్ధిపొందే ఈ వెయ్యి కంపెనీలు సుమారు 80 రంగాలకు చెందినవని, ఇవన్నీ 70 శాతం జాతీయ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) మార్కెట్ కేపిటలైజేషన్‌లో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. అంటే ఈదఫా పన్ను వెసులుబాట్లు సుమారు ఐదేళ్ల గరిష్ట స్థాయి ప్రయోజనాలను కలుగజేస్తాయని తెలిపింది. ప్రధానంగా చమరు, సహజవాయులు, ఫైనాన్స్ సర్వీసెస్ లబ్ధిపొందే అవకాశాలున్నాయని క్రిసిల్ నివేదించింది. ఈ ఏడాది పన్ను కోతకు ముం దున్న పన్నుల వివరాలను బేరీజు వేసుకుని ఈ నివేదికను రూపొందించినట్టు తెలిపింది.