బిజినెస్

తెలంగాణలో వాణిజ్యానికి అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్యాలకు అనుకూల వాతావరణం ఉందని అమెరికాలోని న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని పారిశ్రామిక వర్గాలతో రెండు రోజులుగా తాము సమావేశమైనట్టు ఆయన తెలిపారు. న్యూజెర్సీ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రం సిస్టర్ స్టేట్ పార్టనర్ షిప్ ఒప్పందాన్ని బుధవారం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. న్యూజెర్సీతో చేసుకున్న ఒప్పందం వల్ల తెలంగాణకు ఆయా రంగాల్లో మేలు జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికాలో తాను కొంతకాలం పాటు న్యూజెర్సీలో కూడా ఉన్నానని కేటీఆర్ తెలిపారు. అమెరికాలో తెలుగువారు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో న్యూజెర్సీ కూడా ఒకటని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాలు విద్యా, వ్యాపార, వాణిజ్య అవకాశాల్లో పరస్పరం సహకరించుకుంటామని ఫిలిప్ అన్నారు.
ఐటీ, ఫార్మా, లైఫ్ సైనె్సస్ బయోటెక్ ఫిన్ టెక్ డాటా సెంటర్స్ క్లీన్ ఎనర్జీ, ఉన్నత విద్యా, టూరిజం వంటి రంగాల్లో ఇరు రాష్ట్రాల సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జయేష్ రంజన్, హైదరాబాద్ అమెరికన్ కాన్సుల్ జనరల్ అధికారులు పాల్గొన్నారు.
*చిత్రం... మంత్రి కేటీఆర్ సమక్షంలో సిస్టర్ స్టేట్ పార్టనర్‌షిప్ ఒప్పందం కుదుర్చకున్న చీఫ్ సెక్రటరీ జోషి, న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీ