బిజినెస్

పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు బుధవారం లీటర్‌పై 24- 25 పైసలు వంతున పెరిగాయి. గత జూలై 5న జరిగిన కేంద్ర బడ్జెట్ సమావేశాల తర్వాత తొలిసారిగా ఈ ధరలు పెరగడం గమనార్హం. సౌదీ అరేబియాలో ముడిచమురు ప్రాసెసింగ్ క్షేత్రాలపై డ్రోన్ దాడులు జరగడంతో అక్కడ ఆగిపోయిన సంగం చమురు ఉత్పత్తి ముందే ఊహించిన విధంగా మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపింది. ఈక్రమంలో దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పెట్రోలు లీటర్ ధర 25 పైసలు పెరిగి రూ. 72.42కు చేరగా, డీజిల్ ధర లీటర్‌పై 24 పైసలు పెరిగి రూ. 65.82కు చేరింది. ప్రభుత్వ రీటెయిలర్ల నుంచి అందిన గణాంకాల మేరకు ఇంధనంపై పెరిగిన ఎక్సైజ్ సుంకాల నేపథ్యంలో లీటర్ పెట్రోలియం, డీజిల్‌పై ఏకంగా 2.50 రూపాయలు పెంచుతూ గత జూలైలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత తాజాగా పెరిగిన మొత్తం అతిపెద్ద ఒక రోజు ధరగా నిలిచింది. మంగళవారం డీజిల్‌పై పెరిగిన 14 పైసల ధరతో కలుపుకుని బుధవారం మరో 15పైసలు రేటు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ముడిచమురు దిగుమతుల్లో అధికంగా సౌదీపై ఆధారపడిన మనదేశం సౌదీలో జరిగిన డ్రోన్ దాడులతో తగ్గిన ఉత్పత్తి క్రమంలో ఆ ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ముడిచమురు ధరలు సోమవారంనాడు ఏకంగా 20 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. గడచిన 30 ఏళ్లలో ఏకబిగిన పెరిగిన అత్యధిక ధరగా ఇది నమోదైంది. ఐతే గత రెండేళ్లలో మళ్లీ ముడిచమురు ధరలు దిద్దుబాటుకు గురయ్యాయి. ఈక్రమంలోనే బుధవారం 0.26 శాతం ధరలు తగ్గాయి. దీంతో బ్యారెల్ ధర 72 డాలర్ల నుంచి 64.38 డాలర్లకు దిగివచ్చింది. కాగా అమెరికా ఉత్తర టెక్సాస్ ఇంటర్మీడియెట్ (డబ్ల్యుటీఐ) ముడిచమురు ధర సైతం 0.5 శాతం తగ్గి బ్యారెల్ 59.06 డాలర్ల వంతున ట్రేడైంది. సౌదీ అరేబియాలో ఆగిపోయిన ఉత్పత్తి మళ్లీ ఆరంభమైన క్రమంలో అమెరికా ధరల్లో ఇలా తగ్గుదల నెలకొంది. కాగా ఆబ్‌కైఖ్‌లో ప్రస్తుతం రోజుకు 2మిలియన్ బ్యారెళ్ల చమురు ప్రాసెసింగ్ జరుగుతోంది.
డ్రోన్ దాదులకు ముందు అక్కడ రోజుకు 4.9 మిలియన్ బ్యారెళ్ల ప్రాసెసింగ్ జరిగేది. ఈనెలాఖరులోగా అక్కడ పూర్తి స్థాయి ఉత్పత్తి జరుగుతుందని సౌదీ అరాంకోప్రధాన కార్యనిర్వాహకుడు అమీన్ నాజర్ తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉత్పత్తి మూడు వంతులు జరుగుతోందని మరో పది రోజుల్లో పూర్తి స్థాయికి చేరుతుందని సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పినట్టు అక్కడి వార్తా సంస్థల కథనం. మనదేశ అవసరాల్లో 83 శాతం ముడిచమురు దిగుమతులు చేసుకుంటున్న క్రమంలో అధిక దిగుమతులు చేసుకుంటున్న దేశాల్లో ఇరాక్ తార్వాతి స్థానంలో సౌదీ అరేబియా ఉంది. 2018-19లో సౌదీ నుంచి 40.33 మిలియన్ టన్నుల ముడిచమురును మనదేశం దిగుమతి చేసుకోవడం జరిగింది.