బిజినెస్

కనకదుర్గమ్మ నుదుట కూడా నకిలీ కుంకుమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, సెప్టెంబర్ 18: విజయదశమి ఉత్సవాలకు భక్తులు, ప్రభుత్వం, దేవాలయాలు సిద్ధమవుతున్న తరుణంలో పలు రకాల వస్తువులు విక్రయించే వ్యాపారులు, తయారీదారులు కూడా బిజీ అయ్యారు. అయితే కొందరు నకిలీ సరుకుల తయారీ పనుల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ముత్తయిదువులు, భక్తులు కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చి అమ్మవారి కుంకుమార్చనకు ఉపయోగించిన కుంకుమను ఇళ్లకు తీసుకెళ్లాలని ఎదురు చూస్తుంటారు. అయితే నకిలీ కుంకుమ ఇష్టారాజ్యంగా తయారుచేస్తున్న వ్యాపారులు దాన్ని అప్పుడే మార్కెట్‌లోకి వదిలారు. దీన్ని నుదుట దిద్దిన మహిళలు తాము మోసపోయామని, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. పవిత్రంగా భావించి నుదుట పెట్టిన కుంకుమలో రసాయనాల ప్రభావం ఎక్కువై దద్దర్లు, దురదలు వస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు. దసరా ఉత్సవాల్లో నగరానికి లక్షలాదిగా భక్తులు వస్తారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. అలాంటి వారు నకిలీల బారిన పడుతున్నారు. అచ్చమైన కుంకుమ, పసుపు మాత్రమే ఉపయోగించి సంప్రదాయబద్ధంగా తయారుచేయాల్సి ఉండగా వ్యాపారులు స్వార్థ ప్రయోజనాల కోసం రసాయనాలు ఉపయోగించి లేత పసుపు, ముదురు ఎరుపు, మెరూన్ రంగుల్లో కుంకుమ తయారు చేస్తున్నారు. దసరా ఉత్సవాల్లో నగరంలో టన్నులకొద్దీ కుంకుమ వినియోగం జరుగుతుంది. అమ్మవారి కుంకుమ అంటూ ఇరుగుపొరుగు వారికి కుంకుమ పొట్లాలు పంచడం తెలుగింటి ఆడపడుచులకు సంప్రదాయంగా వస్తున్న అలవాటు. ఇలాంటి సెంటిమెంట్‌ను వ్యాపారులు తమ స్వార్థానికి ఉపయోగించుకుంటూ నకిలీ కుంకుమ తయారుచేసి మార్కెట్‌లోకి వదిలేశారు. ఈసారి బెజవాడ కనకదుర్గమ్మ నుదుట కూడా నకిలీ కుంకుమేనా? అంటూ మహిళా భక్తులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తమై నకిలీల ఆట కట్టించాలని వినియోగదారులు కోరుతున్నారు.