బిజినెస్

దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బతీసిన ముడిచమురు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : సౌదీ అరేబియాలోని దిగ్గజ చమురు ప్రాసెసింగ్ క్షేత్రాలపై డ్రోన్ దాడులు జరగడం మనదేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో ఆందోళనకు గురైన మదుపర్లు పెద్దయెత్తున వాటాల విక్రయాలకు పాల్పడ్డారు. దీంతో సోమవారం ఒక దశలో ఏకంగా 356 పాయింట్లు నష్టపోయిన 30 షేర్ల సూచీ సెనె్సక్స్ చివరికి 261.68 పాయింట్లు కోల్పోయి 0.70 శాతం నష్టాలతో 37,123.31 పాయింట్ల దిగువన స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 79.80 పాయింట్లు కోల్పోయి 0.72 శాతం నష్టాలతో 10,996.10 పాయింట్ల దిగువన స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో ఎం అండ్ ఎం, ఎస్‌బీఐ, యెస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటాస్టీల్, ఎల్ అండ్ టీ అత్యధికంగా 2.55 శాతం నష్టాలను చవిచూశాయి. మరోవైపు టెక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, సన్‌పార్మా, హెచ్‌యూఎల్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్ 1.44 శాతం లాభాలను సంతరించుకున్నాయి. ఇలావుండగా అంతర్జాతీయంగా సోమవారం ముడిచమురు ధరలు దాదాపు 10 శాతం పెరిగి ప్రపంచ మార్కెట్లలో ఆందోళన రేకెత్తించాయి. కారణం గత శనివారం సౌదీ అరేబియా చమురు ప్లాంట్లపై జరిగిన డ్రోన్‌దాడులేనని విశే్లషకులు చెబుతున్నారు. సొదీలో మొత్తం చమురు ఉత్పత్తుల్లో దాదాపుసగభాగం (5.7 మిలియన్ బ్యారెళ్లు) ఒక్కసారిగా తగ్గిపోవడంతో ప్రపంచ స్థాయిలో చమురు సరఫరాల్లో 5శాతం కొరత నెలకొంది. దీంతో ముడిచమురు ధర బ్యారెల్ 71.95 డాలర్లకు పెరిగింది. ఈక్రమంలో మనదేశంలోని సంబంధిత కంపెనీలైన హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ, కాస్ట్రోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వాటాలు దాదాపు 7శాతం పడిపోయాయి. అలాగే విమానయాన సంస్థలు స్పైస్‌జెట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, జెట్ ఎయిర్‌వేస్ వాటాలు సైతం 3.95 శాతం నష్టపోయాయి. కాగా ముడిచమురు ధరలు అనూహ్యరీతిలో భారీగా పెరగడంతో మనదేశ ఆర్థికాభివృద్ధిపై సైతం ఆ ప్రభావం పడుతుందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. 3ఈ దుష్ప్రభావం ఎంతగా ఉందంటే కేంద్ర ప్రభుత్వం మూడో దఫాప్రకటించిన ఉద్దీపన చర్యలను సైతం మదుపర్లు లెక్కలోకి తీసుకోకుండా వాటాల విక్రయాలకు దిగేంతగా2 అని ప్రముఖ విశే్లషకుడు గౌరవ్‌దువా పేర్కొన్నారు. అంతేకాకుండా సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల మేరకు ఆగస్టులో టోకు విక్రయ ధరల ఆధారిత ద్రవ్యోల్బణంలో ఎలాంటి మార్పూ లేకుండా 1.08గానే ఉంది. అయితే ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం మాత్రం 6.15 నుంచి 7.67 శాతానికి పెరిగింది.
పడిపోయిన రూపాయి విలువ
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం 61 పైసలు తగ్గి ఇంట్రాడేలో 71.53గా ట్రేడైంది. ఇక ఆసియా మార్కెట్లలో షాంఘై కాంపోజిట్ సూచీతోబాటు హ్యాంగ్‌సెంగ్ నష్టాలతో ముగియగా కోస్పి మాత్రం లాభాలను నమోదు చేసింది. ఐరోపా స్టాక్ ఎక్చేంజీలు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలను నమోదు చేశాయి.