బిజినెస్

ద్రవ్యోల్బణంలో ఎలాంటి మార్పూ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: గడచిన ఆగస్టులో టోకు విక్రయ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్యుపీఎల్) ఎలాంటి మార్పూలేకుండా 1.08 శాతంగానే ఉంది. ఈక్రమంలో వచ్చే నెలలో జరిగే రిజర్వు బ్యాంకు ద్రవ్య విధాన సమీక్షా సమావేశంలో మరోదఫా రేట్లకోతకు ఆస్కారం నెలకొంది. అంతేకాకుండా ఈ విషయంలో వినిమయ ధరల సూచీ ద్రవ్యోల్బణాన్ని సైతం ఆర్బీఐ పరగణలోకి తీసుకుంటుందని, కీలక రంగాల ద్రవ్యోల్బణం అంచనాల్లో తగ్గుదల సైతం ఆర్బీఐ మరోదఫా రేట్ల కోతకు ఊతమిస్తోందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల మేరకు గడచిన ఆగస్టులో ఆహార వస్తువుల ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల, పాక్షికంగా తయారీ రంగ వస్తువుల ధరలను సమాంతరంగా ఉండేలా చేశాయని తెలుస్తోంది. అలాగే జూలైలో టోకు ధరల సూచీ (డబ్ల్యుపీఐ) ద్రవ్యోల్బణం 1.08 శాతానికి తగ్గింది. ఇది గడచిన ఏడాది ఆగస్టులో 4.62 శాతంగా ఉండేది. ఇక ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం ఆగస్టులో 7.67 శాతానికి పెరిగింది. ఇది జూలైలో 6.15 శాతంగా ఉండేది. ఇందుకు కారణం కూరగాయల ధరలు, ప్రోటీన్ రిచ్ వస్తువుల ధరలు పెరగడమే. కూరగాయల ధరల ద్రవ్యోల్బణం గతనెలలో 10.67 శాతం నుంచి 13.07 శాతానికి పెరిగింది. అలాగే గుడ్లు, మాంసం, చేపలు వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాల ద్రవ్యోల్బణం 3.16 నుంచి 6.60 శాతానికి పెరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇంధనం, విద్యుత్ బాస్కెట్ మాత్రం ద్రవ్యోల్బణ తరుగుదల 4 శాతాన్ని నమోదును కొనసాగిస్తూనే ఉంది. ఇది జూలైలో 3.64 శాతంగా ఉండేది. కాగా కీలక టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ) గడచిన ఆగస్టులో తరుగుదల విస్తృత స్థాయిలో ఉంది. ఓవైపు 15 అనుబంధ రంగాలు ద్రవ్యోల్బణ సరళీకరణను నమోదు చేశాయి. ఇందులో దాదాపు 9 కేటగిరీలు ఇయర్ ఆన్ ఇయర్ విధానంలో ద్రవ్యోల్బణ సరళీకరణను సంతరించుకున్నాయని ‘ఇక్రా’కు చెందిన ప్రముఖ వాణిజ్య విశే్లషకురాలు అతిధి నాయర్ తెలిపారు. అలాగే ముడిచమురు ధరల్లో ప్రస్తుతానికి వృద్ధి చోటుచేసుకునే అవకాశాలున్నాయని తెలిపారు. మిగిలిన క్యాలెండర్ ఏడాదిలో కీలక టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సబ్‌జీరోగానే ఉంటుందని అంచనా వేశారు. కాగా గడచిన ఆగస్టులో కీలక టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణంలో నెలకొన్న తగ్గుదలతో వచ్చే నెలలో జరిగే ఆర్బీఐ ద్రవ్య వినిమయ విధాన సమీక్షా సమావేశంలో మరోదఫా రేట్ల కోతకు ఆస్కారం నెలకొందని ఆమె తెలిపారు. కాగా ఆగస్టులో రీటెయిల్ ద్రవ్యోల్బణం 3.15 నుంచి 3.21 శాతానికి పెరిగింది. ప్రధాన కారణం ఆహార వస్తువుల ధరల ఆధిక్యతేనని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇలావుండగా రిజర్వు బ్యాంకు ఈ ఏడాది ఇప్పటికే 110 బేసిస్ పాయింట్ల మేర విడతల వారీగా రెపోరేట్ల కోత విధించడం జరిగింది. ఈక్రమంలో ఆర్ధికాభివృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయి 5 శాతానికి పడిపోవడంతో దీన్ని గాడిలో పెట్టేందకు మరోవిడత ఆర్బీఐ రేట్లకోత అనివార్యంగా మారింది.