బిజినెస్

మళ్లీ పసిడి ధర పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: బంగారం ధరలు సోమవారం మళ్లీ గణనీయంగా పెరిగాయి. రూపాయి మారకం విలువ బలహీనపడటంతోబాటు ముడిచమురు ధరలు పెరగడమే ఇందుకు కారణమని విశే్లషకులు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాములు (తులం)పై రూ. 460 పెరిగిన పసిడి మొత్తం ధర రూ. 38,860కి చేరింది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై మదుపుచేయడమే సురక్షితమని ఇనె్వస్టర్లు బావిస్తున్నారు. ఈక్రమంలో 24 కేరట్ల బంగారం 10 గ్రాములు రూ. 38,860 పలికింది. గత శనివారం ఈ ధర రూ.38,400గా ఉండేది. అలాగే వెండి ధర సైతం కిలోపై ఏకంగా రూ.1,096 పెరిగి మొత్తం ధర రూ.47,957కు చేరింది. ఢిల్లీలో 24 కేరట్ల స్పాట్‌గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 460 పెరిగి మొత్తం ధర రూ. 38,860కి చేరింది. రూపాయి మారకం విలువ 68 పైసలు పడిపోవడం బంగారం ధరల పెరుగుదలకు తోడ్పడిందని విశే్లషకులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయంగా చూస్తే న్యూయార్క్‌లో సోమవారం ఔన్సు బంగారం ధర 1.504 డాలర్లకు, ఔన్సు వెండి ధర 17.87 డాలర్లకు పెరిగాయి. కాగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరగడం సైతం ముదుపర్లను బంగారం వైపుచూసేలా చేసిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.