బిజినెస్

అమెరికన్ మార్కెట్లోకి క్యాప్సూల్ లాన్సోప్రజోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: తరచూ వచ్చే గుండె ల్లో మంట నివారణకు చేసే వైద్యంలో వినియోగించేలా తమ కంపెనీ తయారు చేసిన ‘లాన్సోప్రజోల్’ క్యాప్సూల్‌ను అమెరికన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్టు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సోమవారం నాడిక్కడ తెలిపింది. అలాగే అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన మేరకు 15 ఎంజీ సామర్ధ్యంతో రూపొందించిన యూఎస్‌పీ క్యాపూల్స్‌ను అమెరికన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టడంలో మా త్రం కొంత ఆలస్యంగా చోటుచేసుకుందని తెలిపిం ది. అంటాసిడ్స్, పీపీఐ పోర్ట్‌పోలియోలో తమవం తు వినియోగదారుల సేవకు కృషిని కొనసాగిస్తామ ని ఈ సందర్భంగా లాబోరేటరీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, యూఎస్ ఓటీసీ అధిపతి మిలాన్ కలావాడియా తెలిపారు. వారానికి కనీసం రెండుకన్నా ఎ క్కువసార్లు గుండెల్లో మంట వచ్చే వారికి చేసే వైద్యసేవల్లో ‘లాన్సోప్రజోల్’ క్యాప్సూల్స్ ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఇలావుండగా డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ వాటా ధర సోమవారం 0.43 శాతం నష్టంతో రూ.2,720.10 వంతున పలికింది.