బిజినెస్

గృహ రుణాల వడ్డీరేట్ల విధానంపై ఆర్బీఐ నుంచి స్పష్టత తీసుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లెహ్, సెప్టెంబర్ 15: దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ కలిగిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దీర్ఘకాలిక గృహ రుణాల కేటాయిపుపై సందిగ్థావస్థలో ఉంది. దీనిపై రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నుంచి స్పష్టత తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ప్రధానంగా తొలుత స్థిరీకరించిన వడ్డీరేట్లతోనూ, ఆ తర్వాత దాన్ని ఫ్లోటింగ్ రేటుగానూ మార్పు చేసుకునే విషయంలో బ్యాంకు బాధ్యతలు ఏమిటన్న విషయంపై ఆర్బీఐ నుంచి స్పష్టత తీసుకోదలిచామని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. అన్ని రీటైయిల్ రుణ వడ్డీరేట్లను ఫ్లోటింగ్ రేట్లుగా మార్పు చేసుకోవాల్సిందిగా బ్యాంకులకు ఇటీవల ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఎస్‌బీఐ సందిగ్ధావస్థను ఎదుర్కొంటోంది. ఇప్పటికే మంజూరుచేసిన నిర్ణీత వడ్డీరేట్లతో కూడిన రుణాలను ఎలా ఫ్లోటింగ్ రేట్లకింద మార్పు చేయాలన్న దానిపై స్పష్టత రావాల్సివుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రెపోరేట్ల విషయంలో ఊగిసలాట సాగుతున్న విషయాన్ని నర్మగర్భంగా ఆయన గుర్తుచేస్తూ రుణాలపై ఇళ్లు కొనుక్కోదలచిన కొంతమంది లబ్ధిదారులు నిర్థిష్టమైన వడ్డీరేట్లనే కోరుకుంటున్నారని తెలిపారు. అలాంటి వారికి ‘నిర్ణీత ఫ్లోటింగ్’ ప్రాడక్టు విధానాన్ని ఆఫర్ చేయాలని ఎస్‌బీఐ భావిస్తోంది. తద్వారా ప్రాధమికంగా ఐదు నుంచి పదేళ్ల కాలం వరకు ఒకే రకమైన వడ్డీరేట్లు లాక్ అవుతాయి. ఆ తర్వాత ఫ్లోటింగ్‌గా మార్పు చెందుతాయి. ఇలా మార్పు చేసిన తర్వాత బ్యాంకు బాధ్యతలు ఏమిటన్న విషయంపై స్పష్టత లేదన్నారు. గృహ రుణాలు దాదాపు 30 ఏళ్ల కాలవ్యవధితో ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్ నిర్దేశాల మేరకు ప్రస్తుతం ఉన్న తొమ్మిదేళ్ల కనిష్ట వడ్డీ రేటు 5.40తో రెండు రకాల విధానలతో ఎలా ముందుకు వెళ్లాలన్నది తెలియాల్సివుందన్నారు. 30 ఏళ్ల దీర్ఘకాలం ఉండే గృహ రుణాల వడ్డీరేట్ల విషయంలో సెంట్రల్ బ్యాంక్ మార్గదర్శకాలను పాటించడం కష్టతరమేనన్నారు. కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకులు 35 ఏళ్ల దీర్ఘకాలిక గృహ రుణాలను మంజూరు చేస్తున్నాయని కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. రుణాలు ఇలా మార్పు చేయడం వల్ల వడ్డీరేట్లు గణనీయంగా పెరుగుతాయన్నారు. తొలుత తమ బ్యాంకే సవరించిన రెపోరేట్లతో కూడిన రుణాల మంజూరును గత మేనెల నుంచి చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.