బిజినెస్

అదుపులోనే ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, పారిశ్రామికోత్పత్తి పునరుజ్జీవనం పొందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలు ప్రకటించడానికి శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ద్రవ్యోల్బణం చాలా తక్కువగా నాలుగు శాతం కన్నా దిగువన ఉందని అన్నారు. ప్రభుత్వం చిల్లర ద్రవ్యోల్బణం 2శాతం నుంచి 6శాతం వరకు ఉండేట్టు చూడాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)ను ఆదేశించినట్టు ఆమె తెలిపారు. వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.21 శాతం నమోదయింది. 2018-19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పారిశ్రామికోత్పత్తికి సంబంధించి ఆందోళనలు నెలకొని ఉన్నప్పటికీ, 2019 జూలై వరకు మెరుగుపడినట్టు స్పష్టమయిన సూచనలు మనకు కనిపిస్తున్నాయని సీతారామన్ పేర్కొన్నారు.
పాక్షిక రుణ భరోసా పథకం సహా బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీల)కు రుణాలను పెంచడానికి తీసుకున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం ప్రారంభమయిందని ఆమె వివరించారు. ‘అనేక బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు లబ్ధి పొందాయి’ అని మంత్రి పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి గోవాలో సమావేశం కావడానికి ఒక రోజు ముందు సెప్టెంబర్ 19న ఆర్థిక వ్యవస్థకు రుణ ప్రవాహం పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయడానికి తాను ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో భేటీ అవుతున్నట్టు సీతారామన్ తెలిపారు.
*చిత్రం... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్