బిజినెస్

లాభాల్లో మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భారత స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లోకి వచ్చాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్ 198.01 పాయింట్లు (0.5 శాతం) లాభపడింది. 37,343.46 పాయింట్లకు చేరుకుంది. అదేవిధంగా జాతీయ స్టాక్ ఎ క్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ) లో నిఫ్టీ 51.75 పా యింట్లు పెరిగి 11,054.80 పాయింట్లకు చేరింది. బుధవారం ఉదయం మార్కెట్ లావాదేవీలు ప్రారంభమైన వెంటనే టెక్నాలజీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఆటోమొబైల్ షేర్లు బలోపేతం కావడంతో మిగ తా రంగాలు కూడా లాభపడేందుకు అవకాశాలు లభించా యి. రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సన్ అండ్ టుబ్రో, మారుతీ సుజుకీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు భారీగా లాభాలను ఆర్జించాయి. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్లో పెద్దగా మార్పులు ఏవీ లేనందున మార్కెట్లు సజావుగా సాగాయి. దసరా, దీపావళి సీజన్ సమీపిస్తున్న సమయంలో వివిధ వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయి. దీంతో ఆయా కంపెనీల స్టాక్స్ లాభాల్లో ట్రేడయ్యాయి.