బిజినెస్

మాంద్యంలోనూ వృద్ధి వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : రానున్న ఐదేళ్ల కాలంలో భారత్‌ను 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారంనాడు ఇక్కడ అన్నారు. ఒకపక్క దేశీయంగానూ అంతర్జాతీయంగానూ ఆర్థిక మాంద్య పరిస్థితులు తీవ్రమవుతున్నప్పటికీ నిర్దేశిత లక్ష్య సాధన దిశగా కేంద్రం బలంగానే ముందుకు వెళ్తోందని ఆమె అన్నారు. వంద లక్షల కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా వౌలిక సదుపాయాల విస్తరణ అవకాశాలను పరిశీలించేందుకు ఒక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ వంద రోజుల వ్యవధిలో మోదీ సర్కారు సాధించిన విజయాలను వివరించిన సీతారామన్ భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలు తీరాలంటే బలమైన వౌలిక సదుపాయాల వ్యవస్థ ఎంతో అవసరమని అన్నారు. దీనివల్ల లక్షలాదిగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు. రుణ లభ్యత ఆర్థిక వృద్ధికి ఊతాన్నిచ్చే లక్ష్యంతోనే అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని 10 ప్రభుత్వరంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులు బలమైన వ్యవస్థగా విలీనం చేయడం జరిగిందని ఆమె వివరించారు. ఈ విలీనం వల్ల దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ పరస్పరం శక్తిని సంతరించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్న సీతారామన్ 3్భరత్ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు బలమైన బ్యాంకుల దన్ను ఎంతైనా అవసరం. ఈ ఉద్దేశ్యంతోనే బ్యాంకుల విలీన నిర్ణయం తీసుకోవడం జరిగింది2 అని వివరించారు. ఆటోమొబైల్స్‌పై జీఎస్టీ రేటును తగ్గించే విషయంలో తాను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేనని, ఈ దిశగా తనకు అందిన సూచనలను పరిశీలించి, త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తానని ఆమె తెలిపారు.

చిత్రం...ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్