బిజినెస్

ప్రైవేటు ఈక్విటీలు, వెంచర్లలో 36.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 10: గడచిన ఆగస్టు మాసంలో వెంచర్ పెట్టుబడుల్లో 4.4 బిలియన్ డాలర్ల మేర లావాదేవీలు జరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 39 శాతం అధికం. అయితే జూలైతో పోల్చుకుంటే ఇందులో 47 శాతం తగ్గుదల కనిపిస్తోందని అంతర్జాతీయ కనె్సల్టెన్సీ సంస్థ 3ఈఏ అండ్ ఐవీసీఏ2 మంగళవారం నాడిక్కడ విడుల చేసిన అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఈ పెట్టుబడులు సరికొత్త గరిష్ట స్ధాయి 36.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో గత యేడాది సైతం 36.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని నివేదించింది. దేశంలో మొత్తం ప్రైవేటు ఈక్విటీ లేదా వెంచర్ కేపిటల్ పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 48 నుంచి 50 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఆ అధ్యయనం వెల్లడించింది. గత జూన్ మాసంలో వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్ట స్థాయి 5 శాతానికి చేరిన క్రమంలో వెలువడిన ఈ గణాంకాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆర్థిక మాంద్యం, ద్రవ్యలోటు, మార్కెట్ సెంటిమెంట్, బలహీన కరెన్సీ మారకం విలువ వంటి అంశాలు మదుపర్లను ప్రైవేటు ఈక్విటీల వేపు చూసేలా చేశాయని ఆ నివేదిక తెలిపింది. ప్రైవేటు ఈక్విటీలు, వెంచర్ కేపిటల్‌లో వచ్చిన మొత్తం 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో వౌలిక వసతులు, స్థిరాస్తి రంగాల భాగస్వామ్యం 35 శాతమని నివేదిక పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ భాగస్వామ్యం 23 శాతంగా ఉండేదని వివరించింది. వౌలిక రంగానికి విదేశీ కొనుగోళ్లు, పింఛన్లు, సార్వభౌమ నిధుల నుంచి వడ్డీ సొమ్ము అందుతుంది. సమీప భవిష్యత్తులో ఈ పరిస్థితులు మరింత బలపడతాయని ఆ అధ్యయనం వెల్లడించింది. ప్రభుత్వం, ప్రైవేటు రంగ కంపెనీలు సైతం ఆస్తులను ద్రవ్యరూపంలోకి మార్చుకునే ప్రయత్నాలు చేస్తుండటం వల్ల ఇలా ప్రత్యక్షంగా లేదా ఐ ఎన్‌వీఐటీ స్ట్రక్చర్ ద్వారా ఆస్తులు చేతులు మారడం స్వచ్ఛమైన లాభాలు వచ్చే అవకాశాలున్నాయని నివేదిక తెలిపింది. గత నెలలో వృద్ధి రంగంలో మొ త్తం 20 లావాదేవీలు జరుగగా అందులో 1.6 బిలియన్ డాలర్ల అత్యధిక స్థాయి పెట్టుబడులు వచ్చా యి. అలాగే అంకుర సంస్థల్లో జరిగిన 50 లావాదేవీల్లో 1.4 బి. డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.