బిజినెస్

ఉత్పాదక వ్యయం తగ్గించుకుంటేనే మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 23: ఉత్పాదక వ్యయం తగ్గించుకుంటేనే నాణ్యమైన ఉక్కు ఉత్పత్తులను అందుబాటు ధరలకు మార్కెటింగ్ చేసుకుంటేనే ఉక్కు పరిశ్రమ మనుగడ సాధించగలుగుతుందని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) సీఎండీ ప్రదోష్ కుమార్ రథ్ అభిప్రాయపడ్డారు. ఉక్కు ఉత్పత్తి వ్యయం నియంత్రణ - దీర్ఘకాలిక ఉత్పత్తుల మార్కెటింగ్ అనే అంశంపై విశాఖలో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉక్కు పరిశ్రమలు అందిపుచ్చుకోవాలని సూచించారు.
దేశీయంగా 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తులు లక్ష్యంగా కేంద్రం ఆలోచన చేస్తోందని, అయితే ప్రస్తుతం దేశీయ ఉక్కు ఉత్పత్తులు 130 టన్నులు మాత్రమేనన్నారు. దేశీయంగా తలసరి ఉక్కు వినియోగం భారత్‌లో కేవలం 73 కిలోలు మాత్రమే ఉండగా, అంతర్జాతీయంగా 228 కిలోలుగా ఉందని, 600 కిలోల తలసరి వినియోగంతో చైనా అగ్రస్థానంలో ఉందన్నారు. గత కొద్ది నెలలుగా ఉక్కు పరిశ్రమ తాత్కాలిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. గ్రామీణ భారతదేశంలో ఉక్కు వినియోగం పెరిగితేనే సంక్షోభం నుంచి గట్టెక్కుతామన్నారు. దేశీయంగా ఉక్కు ఉత్పాదక వ్యయం తగ్గితే తక్కువ ధరకు ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఉక్కు ఉత్పత్తులతో పాటు పర్యావరణం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్ ఆధీనంలో విశాఖ ఉక్కు కర్మాగారం విస్తరణతో 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని చేరుకుందన్నారు. రాయబరేలీలో ఆర్‌ఐఎన్‌ఎల్ ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రారంభించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న రైలు చక్రాల తయారీకి అవసరమైన ఉక్కు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల విషయంలో ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఓఎండీసీ, ఎన్‌ఎండీసీ నుంచి ముడి సరుకు సరఫరా నిరాటంకంగా జరుగుతోందన్నారు. ఒడిశా వద్దనుకుంటున్న పోస్కో స్టీల్ పరిశ్రమ విశాఖలో ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉందన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ దేశ ప్రయోజనాల దృష్ట్యా విదేశీ ప్రైవేటు కంపెనీలు వస్తే ఆహ్వానించడం సరైనదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఉక్కు పరిశ్రమ త్వరలోనే గట్టెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జేఎస్‌డబ్ల్యు స్టీల్స్ లిమిటెడ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ తమ సంస్థ దేశంలోని ఉక్కు ఉత్పత్తుల్లో 15 శాతం వాటాకలిగి ఉందన్నారు.
ప్రస్తుతం మార్కెట్ కొంతమేర స్తబ్ధతతో ఉందని, త్వరలోనే పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఎన్ దస్తర్ అండ్ కో లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్రత మిశ్రా మాట్లాడుతూ చిన్న, మధ్యతరహా ఉక్కు పరిశ్రమలు ఖర్చుల నియంత్రణ పాటించుకుంటేనే మనుగడ సాధించగలవన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్టీల్ పరిశ్రమ ప్రతినిధులు పలు అంశాలకు సంబంధించి వేర్వేరుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.