బిజినెస్

మాంద్యం దెబ్బకు మార్కెట్లు మటాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : ఆర్థిక మాంద్యం కారణంగా నష్టాల్లో కూరుకుపోయిన రంగాలను పునరుత్తేజం చేసేందుకు ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద ప్రత్యేక ప్యాకేజీలేవని అధికారులు తేల్చిచెప్పడం స్టాక్ మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీసింది. బ్యాంకింగ్, వాహన, లోహ స్టాక్స్‌లో గురువారం మరోదఫా అమ్మకాల వత్తిడి నెలకొనడంతో దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి. వీటికి తోడు రూపాయి విలువ ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోవడం, అంతర్జాతీయంగా సైతం ప్రతికూలతలు సాగుతుండటం మదుపర్ల సెంటిమెంటుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిందని వాణిజ్య వర్గాలు తెలిపాయి. బీఎస్‌ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఏకంగా 587.44 పాయింట్లు కోల్పోయి 1.59 శాతం నష్టాలతో 36,472.93 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇక బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 177.35 పాయింట్లు కోల్పోయి 1.62 శాతం నష్టాలతో కీలక 10,741.35 పాయింట్ల కనిష్టానికి చేరింది. ఇలా దేశీయ మార్కెట్లు వరుసగా మూడు రోజులపాటు నష్టాల్లో గురువారం మరీ తీవ్ర స్థాయిలో నష్టాలు రావడం వాణిజ్య వర్గాలను కలవరపరచింది. ‘ప్రజలు పన్నుల రూపేణా చెల్లిస్తున్న సొమ్మును కంపెనీల పునరుత్తేజానికి వినియోగించడం నైతికతకు విఘాతం కలిగిస్తుందని, మార్కెట్ల ఆర్థికాభివృద్ధికి భవిష్యత్తులోప్రమాదకంగా మారుతుంద’ని కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమనియన్ గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రకటించారు. అలాగే ‘ఆర్థిక పరమైన ప్యాకేజీల కంటే వడ్డీ రేట్లకోత, రుణాలను ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంచడం వంటి చర్యలు చేపట్టడమే సబబుగా ఉంటుంద’ని అదే కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ శాఖ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ వ్యాఖ్యానించారు. ఇలా ఈ ఇద్దరు కీలక వ్యక్తుల వ్యాఖ్యలతోప్రభుత్వం ఏదో ప్యాకేజీతో ముందుకు వచ్చి ఆర్థిక మాంద్యాన్ని చక్కదిద్దుతుందన్న మదుపరుల ఆశలపై నీళ్లు చల్లాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.
భారీ నష్టాల్లో ఎస్ బ్యాంక్
సెనె్సక్స్ ప్యాక్‌లో గురువారం నష్టపోయిన కంపెనీల్లో 13.91 శాతం నష్టాలతో ఎస్ బ్యాంక్ అగ్రభాగాన నిలించింది. అలాగే వేదాంత, బజాజ్ ఫైనాన్స్, టాటామోటార్స్ సైతం 7.76 శాతం అధిక నష్టాలను సంతరించుకున్నాయి. ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, హీరోమోటోకార్ప్ ఐసీఐసీఐ బ్యాంక్, టాటాస్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, ఆర్‌ఐఎల్ సైతం నష్టాలపాలయ్యాయి. మరోవైపుటెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌యుఎల్, హెచ్‌సీఎల్ టెక్ 1.57 శాతం లాభపడి స్టాక్ మార్కెట్లకు కొంత చేయూతగా నిలచాయి. కాగా దేశీయంగా విధాన నిర్ణయ అనిశ్చితితోబాటు అంతర్జాతీయంగా మార్కెట్ల పరిస్థితి సైతం నిరాశాజనకంగా ఉండటం విదేశీ పెట్టుబడులకు అడ్డుకట్ట వేసిందని ప్రముఖ విశే్లషకుడు హేమాంగ్ జానీ అభిప్రాయపడ్డారు. అలాగే గత నెల వరకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం విద్యుత్ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సుభాష్‌చంద్ర గార్గ్ గురువారం చేసిన మరికొన్ని వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వెలువడిన జీడీపీ అంచనాలు గత సంవత్సరం ఇదే కాలంలో వెలువడిన జీడీపీ గణాంకాలకంటే తక్కువగా ఉన్నాయని ఆయన ప్రకటించడం మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
తీవ్రంగా నష్టపోయిన స్థిరాస్తి రంగం
బీఎస్‌ఈలో రంగాల వారీగా చూస్తే గురువారం స్థిరాస్తి రంగం అత్యిధికంగా 6.01 శాతం నష్టపోయింది. అలాగే లోహ, ఫైనాన్స్, చమురు, సహజవాయులు, బ్యాంకెక్స్ సూచీలు నష్టాలపాలయ్యాయి. ఇక ఐటీ సూచీ మాత్రం 0.30 శాతం లాభదాయకంగా నిలిచింది. ఈ నష్టాలకు ప్రధాన కారణం రూపాయి బలహీన పడటమే. కాగా బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 2.19 శాతం నష్టాలను నమోదు చేశాయి.
ఒడిదుడుకుల్లో అంతర్జాతీయ మార్కెట్లు
అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జరోమ్ పావెల్ వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లు సైతం గురువారం తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఆసియా మార్కెట్లలో షాంఘై కాంపోజిట్ సూచీ, నిక్కీ లాభాల్లో ముగియగా, హ్యాంగ్‌సెంగ్, కోస్పి నష్టాలను నమోదు చేశాయి. ఇక ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో నష్టపోయాయి.
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 33 పైసలు నష్టపోయి ఇంట్రాడేలో మొత్తం రూ. 71.88గా ట్రేడైంది. ముడిచమురు ధరలు 0.65 శాతం పెరిగి బ్యారెల్ 60.69 డాలర్లు వంతున ట్రేడైంది.