బిజినెస్

ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : వినాయక చవితికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ల రేట్లను మూడువారాల ముందు నుంచే అడ్డగోలుగా పెంచేస్తూ చుక్కలు చూపిస్తున్నాయి. ఏ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఆర్టీసీతో సమాంతరంగా స్టేజీ క్యారియర్‌గా నడిపే అవకాశం లేనప్పటికీ ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలు సాగిపోతున్నాయి. సాధారణ రోజుల్లో విజయవాడ నుండి బెంగళూరుకు రూ. 900ల నుంచి వెయ్యి రూపాయలు, స్లీపర్ అయితే రూ. 1300లు చార్జీలు ఉండేవి. అదే ఆర్టీసీలో సూపర్ లగ్జరీ రూ. 888లు, గరుడ ఏసీ రూ. 1357లు, వీఎన్‌ఎల్ స్లీపర్ చార్జీ రూ. 1970గా ఉంది. అలాంటిది ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని విమాన చార్జీలతో సమానంగా టికెట్ రేట్లు పెంచేశాయి. సాధారణ రోజుల్లో గన్నవరం నుంచి బెంగళూరుకు విమానం టికెట్ కాస్తంత ముందుగా రిజర్వేషన్ జరిగితే 3వేల రూపాయలు, పండుగ రోజుల్లో రూ. 5వేల వరకు డిమాండ్ ఉంది. అదే ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే కావేరీ ట్రావెల్స్ రూ. 1690, ఎస్‌ఆర్‌ఎస్ ట్రావెల్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ రూ. 2200లు, బిగ్‌బస్ రూ. 2625లు, రాజేష్ ట్రాన్స్‌పోర్ట్స్ రూ. 5014లు, మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ రూ. 1950లు రేటు ప్రస్తుతం ఉంది. అయితే వినాయక చవితి సమీపిస్తున్నకొద్దీ క్షణక్షణానికి డిమాండ్‌ను బట్టి రేట్లు పెరుగుతున్నట్లు స్పష్టవౌతోంది. రైళ్లలో సాధారణ చార్జీ రూ. 800 కాగా ఏసీ త్రీ టయర్‌లో రూ. వెయ్యి, రూ. 1100లు వరకు ఉంది. అనూహ్యంగా పెరుగుతున్న టికెట్ల రేట్లతో సామాన్యులు అత్యవసరమైతే మినహా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే డిమాండ్‌ను బట్టి అవసరమైన మేర ప్రత్యేక బస్సులను తాము బెంగళూరు, హైదరాబాద్, తదితర నగరాలకు నడుపుతామని ఆర్టీసీ కృష్ణా రీజనల్ మేనేజర్ నాగేంద్రప్రసాద్ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి తెలిపారు.