బిజినెస్

అంతర్జాతీయ స్థితిగతులే మార్కెట్లకు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశీయంగా అనుకూలించే అంశాలేవీ లేకపోవడం వల్ల ఈ వారం స్టాక్ మార్కెట్లు ప్రధానంగా అంతర్జాతీయ వాణిజ్య తీరుతెన్నులపైనే ప్రభావితం కానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ వాణిజ్య స్థిగతులు, విదేశీ పోర్టుపోలియో పెట్టుబడులు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలు, చమురు, రూపాయి ధరల తీరుతెన్నులపైనే దేశీయ మార్కెట్లు ప్రభావితం కానున్నాయని అంటున్నారు. అలాగే దేశ వృద్ధిరేటును పెంచేందుకు, వినియోగదారుడి సెంటిమెంటును సానుకూలంగా మార్చేందుకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుదన్న అంశంపై కూడా మదుపర్లు ప్రస్తుతం దృష్టి నిలిపారు. త్రైమాసిక ఫలితాల సీజన్ దాదాపుగా ముగిసిపోతున్న క్రమంలో మెజారిటీ శాతం కంపెనీలు నిరాశాజనక ఫలితాలనే ఇప్పటి వరకు వెలువరించడం జరిగింది. దేశ ఆర్థికాభివృద్ధి మందగమనం కారణంగా అనేక కంపెనీలు గడచిన త్రైమాసికంలో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయాయని, దీన్ని సమూలంగా సరిదిద్దడానికి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రముఖ విశే్లషకుడు జిమీత్ మోడీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు ఇలాగే కొనసాగడం మార్కెట్లకు మరింత నష్టం కలిగించే అంశమని ఆయన అన్నారు. ఆదాయానికి సంబంధించిన సీజన్ ముగిసిపోవడం వల్ల ప్రస్తుతానికి దేశీయంగా మార్కెట్లకు అనుకూలించే ఇతర అంశాలేవీ లేవని అయన అన్నారు. కంపెనీలు ఆదాయాభివృద్ధికి చర్యలు చేపట్టాల్సి ఉందని, అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై, ముడిచమురు, రూపాయి ధరల తీరుపై సైతం ప్రస్తుతం దృష్టి నిలిపారని ఆయన తెలిపారు. దేశీయంగా ఆర్థిక మాంద్యం, ఆశించిన స్ధాయిలోలేని కంపెనీల ఆర్జనలు, వాహన రంగంలో నెలకొన్న సంక్షోభంతోబాటు అంతర్జాతీయ మార్కెట్ల స్థితిగతులు ఈ వారం మార్కెట్ల తీరుతెన్నులను నిర్దేశిస్తాయని మరో ప్రముఖ విశే్లషకుడు ముస్త్ఫా నదీమ్ అభిప్రాయపడ్డారు. ఓ మంచి ప్రభుత్వ ప్యాకేజీ కోసం స్థానిక మార్కెట్లు ఎదురు చూస్తున్నాయని ఆయన అన్నారు. ఇలావుండగా గడచిన వారం రోజుల్లో సెనె్సక్స్ 231.58 పాయింట్లు కోల్పోయి 0.60 శాతం నష్టాల పాలైంది. అలాగే వాణిజ్య యుద్ధాల క్రమంలో విదేశీ మార్కెట్లు సైతం స్థూలంగా నష్టాలతోనే ముగిశాయి. ఈ పరిస్థితులు మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా గతవారం కార్పొరేట్ కంపెనీల ప్రతికూల త్రైమాసిక ఫలితాల కారణంగానే విదేశీ సంస్థాగత పెట్టుబడులు అధిక స్థాయిలో మన మార్కెట్ల నుంచి తరలిపోయాయని కోటక్ సెక్యూరిటీస్ పరిశోధనా విభాగం ఉపాధ్యక్షుడు సంజీవ్ జార్బడే అభిప్రాయపడ్డారు.