బిజినెస్

హైబ్రీడ్, సీఎన్‌జీ కార్లకు పన్ను రాయితీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: హైబ్రీడ్, సీఎన్‌జీ కార్లకు విద్యుత్ వాహనాలకంటే అధికంగా పన్ను రాయితీలు కల్పించాలని దేశీయంగా అతిపెద్ద కార్ల మార్కెట్ కలిగిన మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) కోరుతోంది. అలా జరిగితే దేశంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఎంఎస్‌ఐ చైర్మన్ ఆర్‌సీ భార్గవ ఆదివారం నాడిక్కడ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం హైబ్రీడ్, సీఎన్‌జీ కార్లను సైతం ప్రోత్సహించాలని, విద్యుత్ కార్లకంటే అధిక ఖర్చుతో కూడిన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కార్లు రూపుదిద్దుకోవడం జరుగుతోందని ఆయన చెప్పారు. పర్యావరణ కాలుష్య రహిత ‘గ్రీనర్, కీనర్ కార్లకు జీఎస్‌టీ రాయితీలు ఉండాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని భార్గవ చెప్పారు. హైబ్రీడ్ కార్లు 25 నుంచి 30 శాతం అధిక సామర్ధ్యంతో కూడివని, వీటివల్ల మోటారు వాహనాల రంగం అభివృద్థి దేశీయంగా జరగడంతోబాటు ముడిచమురు కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గుతుందని ఆయన తెలిపారు. విద్యుత్ వాహనాల కంటే ముందు హైబ్రీడ్, సీఎన్‌జీ కార్లకు ప్రోత్సాహాలందించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. విద్యుత్ వాహనాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్‌టీ 12 శాతాన్ని 5 శాతానికి తగ్గిస్తూ గత నెలలో జీఎస్‌టీ మండలి నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ పన్ను ఆగస్టు1 నుంచి అమల్లోకి వచ్చింది. 18 శాతం పన్నును సైతం 5 శాతానికి తగ్గించామన్నారు.