బిజినెస్

రూ.1,000 కోట్లకు తగ్గనున్న రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: కేఫ్ చైన్ ఆపరేటర్ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ తాను చెల్లించవలసిన రుణాల మొత్తం సుమారు రూ. 1,000 కోట్లకు తగ్గుతుందని అంచనా వేసినట్టు శనివారం తెలిపింది. బెంగళూరులోని తన గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కు అమ్మడం వల్ల సమకూరే విక్రయ ధనాన్ని సర్దుబాటు చేసిన తరువాత తన రుణాల మొత్తం భారీగా తగ్గుతుందని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ నియంత్రణ సంస్థకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది. ‘కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ తన అనుబంధ సంస్థ టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్న గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను రూ. 2,600-3,000 కోట్లకు విక్రయించనున్నట్టు ఇదివరకే ప్రకటించింది. చట్టబద్ధమయిన చెల్లింపుల తరువాత గ్లోబల్ విలేజ్ విక్రయాన్ని పరిగణనలోకి తీసుకుంటే కాఫీ డే గ్రూప్ చెల్లించవలసిన రుణాల మొత్తం సుమారు రూ. 2,400 కోట్లు తగ్గుతుంది’ అని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ ఆ పత్రాల్లో వివరించింది. రానున్న 45 రోజుల్లో గ్లోబల్ విలేజ్ విక్రయం ద్వారా సమకూరిన ధనంతో తిరిగి చెల్లింపులు జరిపిన తరువాత కాఫీ డే రుణాల మొత్తం సుమారు రూ. వెయ్యి కోట్లకు తగ్గుతుందని వివరించింది. నియంత్రణ సంస్థకు సమర్పించిన పత్రాలలో పేర్కొన్న దానిని బట్టి కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ 2019 జూలై 31నాటికి మొత్తం రూ. 3,472 కోట్ల రుణాలు చెల్లించవలసి ఉంది. తన అనుబంధ సంస్థ సికాల్ లాజిస్టిక్స్ కూడా కొన్ని నిర్దిష్టమయిన ఆస్తులను విక్రయించడానికి కసరత్తు చేస్తోందని ఆ కంపెనీ వెల్లడించింది.