బిజినెస్

31లోగా జీఎస్టీ చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 16: కేంద్రం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి తెచ్చిన తరువాత 2017-18 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి రిటర్న్స్ దాఖలు చేయని వారు ఈ నెల 31లోగా జీఎస్టీ సేవాకేంద్రాల్లో దాఖలు చేయాలని జీఎస్టీ ఏపీ సర్కిల్ చీఫ్ కమిషనర్ నరేష్‌కుమార్ పెనుమాక స్పష్టం చేశారు. సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది దాటినప్పటికీ పూర్తి రిటర్న్స్ దాఖలు చేయకపోవడంపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా గడువు పొడిగిస్తూ వచ్చామని, ఆగస్టు 31 అనంతరం గడువు పొడిగింపునకు అవకాశం ఉండదన్నారు. ప్రతి నెలా దాఖలు చేసిన రిటర్న్స్‌ను ఏకమొత్తంగా ఏడాదికి లెక్కలు చూపడంలో వ్యాపారులు జాప్యం చేయడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోగా రిటర్న్స్ దాఖలు చేయని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు దార్ల వద్ద నుంచి జీఎస్టీ వసూలు చేసి, ప్రభుత్వానికి చెల్లించకుండా ఉద్దేశ పూర్వకంగా ఎగవేసిన వ్యాపార వేత్తలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా జీఎస్టీ చెల్లించని వారి వివరాలు కమిషన్‌కు తెలియజేస్తే 10 శాతం రివార్డుగా చెల్లిస్తామన్నారు. జీఎస్టీ రిటర్న్ దాఖలుకు శాఖాపరంగా ఎవరైనా ఇబ్బందులు సృష్టిస్తే తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఎపీ సర్కిల్ జీఎస్టీ వసూళ్ల లక్ష్యం రూ.56,026 కోట్లు కాగా, రూ.49,653 కోట్లు వసూలు చేశామని చీఫ్ కమిషనర్ నరేష్ కుమార్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి లక్ష్యం రూ.58,222 కోట్లు కాగా, ఇప్పటి జూలై నెలాఖరు నాటికి రూ.16,037 కోట్లు వసూలు చేశామన్నారు.
జీఎస్టీ రిటర్న్ దాఖలు ప్రక్రియ ఇప్పుడు సులభతరం చేశామన్నారు. వ్యాపారులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు ఇప్పటి వరకూ పలు అవకాశాలు కల్పించామన్నారు. భవిష్యత్‌లో కూడా జీఎస్టీ రిటర్న్ దాఖలుకు సంబందించి జీఎస్టీ ప్రాంతీయ కార్యాలయాల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు నరేష్‌కుమార్ తెలిపారు. ఈ నెల 20న కాకినాడ, విశాఖ వెస్ట్, 21న రాజమండ్రి, విశాఖ నార్త్ జోన్‌లలోను, 23న విశాఖ కేంద్ర కార్యాలయంలోనూ సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్లు కే శ్రీనివాస్, ఫషీక్ అహ్మద్ మాట్లాడారు.